రూ.550 కోట్లు తగ్గిన ఏపీ జీఎస్‌టీ రాబడి

Published: Thursday September 12, 2019
ఆర్థిక వ్యవస్థ మందగమనంతో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం భారీగా పడిపోయింది. జీఎస్టీకి సంబంధించి ఇప్పటివరకు పరిహారం తీసుకునే అవసరం లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి కూడా, కేంద్రం నుంచి పరిహారం తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. నిర్దేశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో ఆ తగ్గిన మొత్తాన్ని కేంద్రం పరిహారం రూపంలో భర్తీ చేయనుంది. ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా రాష్ట్ర జీఎస్టీ కేంద్రం నిర్ణయించిన పరిమితి దాటి వసూలవుతోంది. దీంతో ఇప్పటి వరకు పరిహారం తీసుకునే అవసరం లేకుండా పోయింది.
 
2019-20లో రాష్ట్ర జీఎస్టీ బెంచ్‌ మార్కు రూ.1,900 కోట్లు. దానికి à°Žà°‚à°¤ ఆదాయం తగ్గితే à°† మొత్తాన్ని కేంద్రం రెండునెలలకోసారి ఇస్తుంది. కానీ, జూన్‌, జూలైలో జీఎ్‌సటీ వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. à°ˆ కాలానికి వసూలు కావలసిన రూ.3,800 కోట్లకు రూ.550 కోట్లు తగ్గి రూ.3,250 కోట్లు మాత్రమే వసూలైంది. అయితే ఆగస్టు ముగిసినప్పటికీ à°ˆ పరిహారం ఇంకా రాష్ట్రానికి అందలేదు. కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం కూడా భారీగా క్షీణించడమే దీనికి కారణమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొన్నారు. 20à°¨ జరిగే జీఎస్టీ మండలి సమావేశం తర్వాత పరిహారం వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌పై వ్యాట్‌ కోల్పోవడంతో ఏడాదికి రూ.1000- 1,100కోట్లు, వినియోగం తగ్గడంతో మరో రూ.600- 800కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.