ప్రజలకు నాణ్యమైన జీవనమే ప్రభుత్వ ధ్యేయం

Published: Saturday September 14, 2019
రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలను ప్రగతి పథంలో పరుగులు తీయించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అందరూ కలసికట్టుగా, బాధ్యతాయుతంగా పని చేసి పట్టణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పట్టణ ప్రాంతాలన్నీ ప్రణాళికా బద్ధంగా ఎదిగేలా చూడడంతో పాటు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా ప్రజలు సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేలా చూడాలన్నారు. విజయవాడలో రెండు రోజులుగా జరుగుతున్న మున్సిపల్‌ కమిషనర్ల రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ ముగింపు కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. దేశంలో పట్టణ ప్రణాళికా రంగానికి సంబంఽధించిన వివిధ అంశాల్లో నిపుణులతో శుక్రవారం à°’à°• కమిటీని నియమించామని, ఆరు వారాల్లోపు అది అందజేసే నివేదికను అనుసరించి రాజధాని సహా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
 
à°—à°¤ ప్రభుత్వ హయాంలో పురపాలనకు సంబంధించిన అన్ని వ్యవస్థలూ గాడి తప్పాయని, పట్టణ స్థానికసంస్థలు మురికికూపాలుగా మారి, ప్రజలు అవస్థలకు గురయ్యారన్నారు. à°ˆ పరిస్థితిని మార్చేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని పేర్కొన్నారు. ఒక్క రాజధానే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్‌ ధ్యేయమని బొత్స పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించడంలో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం సహించబోమన్నారు. చక్కటి పనితీరుతో ప్రజలు, ప్రభుత్వ మన్ననలు పొందాలని కమిషనర్లను కోరారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో డంపింగ్‌ యార్డుల కోసం అనువైన స్థలాలను గుర్తించడం, వాటి చుట్టూ ప్రహరీ నిర్మించడంతో పాటు వ్యర్థాల నుంచి విద్యుదుత్పాదన వంటి చర్యల ద్వారా పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరచేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
 
‘స్పందన’ కార్యక్రమంలో సమస్యలను తెలియజేసే ప్రజలకు వెంటనే à°Šà°°à°Ÿ కలిగేలా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై అర్ధరాత్రి ఫోన్‌ చేసినా స్పందించాలన్నారు. డిసెంబరులో నిర్వహించ తలపెట్టిన మున్సిపల్‌ ఎన్నికలకు సన్నాహకాలు పకడ్బందీగా చేయాలని, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కోరారు. à°ˆ వర్క్‌షా్‌పలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, పురపాలక డైరెక్టరేట్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ జేఎస్సార్కేఆర్‌ విజయకుమార్‌, డీటీసీపీ వి.రాముడు, పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.