తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదంటున్న గంటా

Published: Sunday September 15, 2019
 à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు అంతరంగం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. à°—à°¤ కొద్దికాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నాయకులతో అడపాదడపా నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నా...అవి నామమాత్రంగానే ఉంటున్నాయంటున్నారు. మరోవైపు ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం సీనియర్‌ నాయకులు తోట త్రిమూర్తులు తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక్కడ à°—à°‚à°Ÿà°¾ కూడా వెళ్లిపోయే అవకాశం వుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
 
వైసీపీ నాయకులు, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొద్దిరోజులుగా అవకాశం లభించినప్పుడల్లా గంటా శ్రీనివాసరావుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అధికారం లేకపోవడం వల్ల గంటాకు ఏమీ తోచడం లేదని, అధికారంలో వున్న పార్టీల్లోకి వెళ్లడానికి అటు ఢిల్లీలో, ఇటు అమరావతిలో మంతనాలు సాగిస్తున్నారని ఆరోపించారు. అయితే వైసీపీలో చేరడానికి గంటాకు అవకాశాలు లేవని, తలుపులు మూసుకుపోయాయని కూడా ఆయన చెబుతున్నారు.
 
అయితే వైసీపీలోకి గంటాను తీసుకోవడానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మంతనాలు సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి వుంటుందని, అందుకు అంగీకారమైతేనే తీసుకుంటారనే వాదన వినిపిస్తోంది. తన స్థాయికి తగ్గ పదవి ఇస్తే పార్టీలోకి రావడానికి అభ్యంతరం లేదని గంటా చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలేవీ కొట్టిపారేసేంత చిన్నవి కాదని వైసీపీ వర్గాలు చెబుతుండడం గమనార్హం.
 
అయితే à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు మాత్రం తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, అది అప్రస్తుత అంశమని కొట్టి పడేస్తున్నారు. రోజూ తన గురించి ఎవరో ఏదో à°’à°•à°Ÿà°¿ మాట్లాడుతుంటారని, వాటికి సమాధానం ఇవ్వలేనని చెబుతున్నారు. అయితే ఇటీవల ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం అనుమానాస్పదంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కొద్దిరోజుల క్రితం రాజధానిని అమరావతి నుంచి మార్చే అవకాశం వుందనేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసిన సందర్భంలో...à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు. అమరావతిపై ముఖ్యమంత్రి జగన్‌ మౌనంగా వుండడం తగదని, స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతకు మించి ఎక్కువ మాట్లాడలేదు. ఇక వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. వాటిలో కూడా à°—à°‚à°Ÿà°¾ ఎక్కడా పాల్గొనలేదు. అన్న క్యాంటీన్ల మూసివేత, ఇసుక కొరతపై టీడీపీ శ్రేణలు అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాయి. వీటిలోను à°—à°‚à°Ÿà°¾ కనిపించలేదు. ఇటీవల తాజాగా టీడీపీ ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమం నిర్వహించింది. à°ˆ కార్యక్రమంలో కూడా à°—à°‚à°Ÿà°¾ ఎక్కడా పాల్గొనలేదు.
 
ఇక ఎమ్మెల్యేగా గెలిచిన à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గంలో ఇప్పటివరకు పర్యటించలేదని అధికార పార్టీ నేతలు, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆరోపిస్తున్నారు. వీటికి సమాధానం అన్నట్టుగా à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు ఇటీవల రెండుసార్లు ఉత్తర నియోజకవర్గ నాయకులతో మాత్రమే సమావేశం నిర్వహించారు. దానికి పార్టీ నగర అధ్యక్షుడైన ఎస్‌ఏ రెహమాన్‌తో పాటు ఆయన వర్గంగా పేరొందిన బొడ్డేటి కాశీనాథ్‌, భరణికాన రామారావు తదితరులు హాజరయ్యారు.