ప్రి-క్వాలికేషన్‌ లేకుండా పోలవరం బిడ్లకు ఆహ్వానం

Published: Monday September 16, 2019
 à°ªà±‹à°²à°µà°°à°‚ రీటెండర్ల వ్యవహారం ఇప్పుడు రివర్స్‌ గేర్‌లో వెళ్తోంది. బిడ్లు వేసే కాంట్రాక్టు సంస్థలకు ఆర్థిక స్తోమత, అనుభవం, సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం ఏ మాత్రం అక్కర్లేదని రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రి-క్వాలిఫికేషన్‌ లేకుండా ఇంతవరకు ఎక్కడా టెండర్లు పిలవలేదు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ఇష్టారీతిన మార్గదర్శకాలు ఖరారుచేస్తోంది. సంస్థ ఎల్‌-1à°—à°¾ వచ్చాక.. అప్పుడు దానికి సదరు సామర్థ్యం, నైపుణ్యం, స్తోమత ఉన్నాయో లేవో తీరిగ్గా పరిశీలిస్తామని చెప్పడం విస్తుగొల్పుతోంది. పోలవరం సాగునీటి ప్రాజెక్టులో మిగిలిన కాంక్రీటు పనులకూ (రూ.1,771.44 కోట్లు), 960 మెగావాట్ల జల విద్యుత్కేంద్రానికి (రూ.3216.11 కోట్లు) కలిపి రూ.4,987.55 కోట్లకు ఒకే ప్యాకేజీ à°•à°¿à°‚à°¦ జల వనరుల శాఖ పిలిచిన రివర్స్‌ టెండర్‌ విధానంపై నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. టెండర్‌ ప్రక్రియ అంతా ముగిశాక.. సంస్థకు సంబంధించిన సాంకేతికాంశాలను పరిశీలించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
 
సదరు సంస్థ సాంకేతికంగా, ఆర్థికంగా స్తోమత లేనిదైతే.. మొత్తం ప్రక్రియ ఆగిపోయి.. రివర్స్‌ టెండరింగ్‌ అపహాస్యం పాలవుతుందని.. అప్పుడు ప్రాజెక్టు మరింత ఆలస్యం కాదా అని నిపుణులు నిలదీస్తున్నారు. నిజానికి కేంద్రం జాతీయ హోదా ప్రకటించిన సాగునీటి ప్రాజెక్టుకూ.. రాష్ట్ర పరిధిలోని విద్యుదుత్పత్తి సంస్థ (ఏపీ జెన్‌కో) అధీనంలోని రెండు టెండర్లను కలిపి ఒకే ప్యాకేజీగా పిలవడం సరికాదని.. మున్ముందు న్యాయపరమైన చిక్కుముడులకు ఆస్కారం ఉందన్న అభిప్రాయం మొదటి నుంచీ వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రి-క్వాలికేషన్‌ నిబంధనలకు తిలోదకాలిచ్చి.. టెండరు ప్రక్రియలో పాల్గొనే కాంట్రాక్టు సంస్థల అనుభవమూ.. సామర్థ్యం.. ఆర్థిక స్తోమత, సాంకేతిక నైపుణ్యం వంటి వాటిని ముందస్తుగా మదింపు చేయకుండా.. టెండరు ప్రక్రియ ఆఖరి దశలో వాటిని సమీక్షిస్తామని జల వనరుల శాఖ పేర్కొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన డ్యాం భద్రత, సాంకేతిక నైపుణ్యాన్ని మదింపు చేయకుండానే టెండరులో పాల్గొనే అవకాశం ఎలా ఇస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఓపక్క కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆదేశాలకు విరుద్ధంగా.. పనులు చేసే సంస్థను తప్పించి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లిన జగన్‌ ప్రభుత్వం.. రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రాజెక్టు టెండర్ల విషయంలో ఇలాంటి డొల్లతనంతో కూడిన నిబంధనలు రూపొందించడంలోని మతలబు ఏంటని అడుగుతున్నారు.