తడుస్తూనే కోడెలకు ప్రజల అశ్రు నివాళి

Published: Wednesday September 18, 2019
మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు పార్థివదేహం జన్మభూమికి చేరుకొంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అలసిసొలసి తన చెంతకు చేరిన కోడెలను గుంటూరు జిల్లా అక్కున చేర్చుకొంది. బుధవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో అంత్యక్రియలు
నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అయితే తమకు అధికార లాంఛనాలు అవసరంలేదని కోడెల కుటుంబం, టీడీపీ నేతలు తెలిపారు. అంతకుముందు.. అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్‌లోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఉంచిన కోడెల పార్థివదేహాన్ని మంగళవారం ఉదయం అంబులెన్సులో గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. జోరు వాననూ లెక్క చేయకుండా అంబులెన్స్‌ వెళ్లే దారిపొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన అభిమానులు, పార్టీ సానుభూతిపరులు కన్నీటి నివాళి అర్పించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కోడెల పార్థివదేహంతో కలిసి హైదరాబాద్‌ నుంచి గుంటూరు వరకూ వచ్చారు. మధ్యమధ్యలో ప్రజలు అంబులెన్సును ఆపి నివాళులు అర్పించారు. తెలంగాణలోని ఎల్బీనగర్‌, చిట్యాల, నకిరేకల్‌, సూర్యాపేట, కోదాడ వంటి ముఖ్య కేంద్రాలతో పాటు ఇంకా పలుచోట్ల ఆయనను కడసారి చూసేందుకు ప్రజలు ఆరాటపడ్డారు.
 
ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో టీడీపీ శ్రేణులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం à°’à°‚à°Ÿà°¿à°—à°‚à°Ÿ సమయంలో తెలంగాణ సరిహద్దులు దాటి ఆంధ్రాలోని కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత పార్టీ శ్రేణులు బాగా తరలివచ్చారు. à°ˆ జిల్లాలోకి అంబులెన్స్‌ చేరేటప్పటికి జోరున వర్షం మొదలైంది. అయినా, జన ప్రవాహం ఎక్కడా తగ్గలేదు. జగ్గయ్యపేట, చిల్లకల్లు, నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ నగరంలో నివాళి కార్యక్రమాలు భారీగా జరిగాయి. విజయవాడలో కోడెల గౌరవార్థం ఆయన అంబులెన్సు ముందు చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఎమ్మెల్సీలు వెంకన్న, అర్జునుడు, మాజీ మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, ఇతర పార్టీల నేతలు కొంత సేపు పాదయాత్ర చేశారు. à°ˆ సందర్భంగా ‘కోడెల అమర్‌ రహే’, ‘ప్రభుత్వం చేసిన హత్యే కోడెల మరణం’ అంటూ పెద్ద పెట్టున టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. విజయవాడ తర్వాత మంగళగిరి, గుంటూరు నగరంలో మధ్యమధ్యలో అంబులెన్సును ఆపాల్సి వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటలకు గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరాల్సిన కోడెల భౌతికకాయం మూడున్నర గంటలు ఆలస్యంగా ఏడు గంటలకు చేరింది. గుంటూరు పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పించారు.