సీమ భూములన్నీ తడిశాయి.. అయితే ఇబ్బందులూ ఉన్నాయి

Published: Sunday September 22, 2019
‘à°ˆ స్థాయి వర్షాలు రాయలసీమలో అరుదేనని చెప్పాలి. à°ˆ క్రమంలో ఇలాంటి వరదలు రావడమూ మంచిదే’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఐదు జిల్లాల్లో వర్షపాతం తక్కువగా నమోదవుతుందనుకుంటున్న తరుణంలో డ్యాములను నింపిన నీళ్లకు పోటీగా వర్షాలు కురవడంతో సీమ భూములన్నీ తడిశాయని చెప్పారు. à°ˆ మంచితో పాటు కొన్ని ఇబ్బందికర పరిస్థితులూ తోడయ్యాయన్నారు. కర్నూలు జిల్లాలోని వరద ప్రభావిత నంద్యాల, మహానంది, ఆళ్లగడ్డ, బనగానపల్లె తదితర 17 మండలాల్లో నీట మునిగిన పంట పొలాలను, ఇళ్లను పరిశీలించేందుకు శనివారం ఆయన నంద్యాలకు వచ్చారు. ఏరియల్‌ సర్వే జరిపి.. సంబంధిత అధికారులను వరద నష్టం వివరాలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. అనంతరం నంద్యాల మునిసిపల్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల అభిప్రాయాలు సేకరించారు. తర్వాత సమావేశంలో మాట్లాడారు. ‘వరదలతో రూ.784 కోట్ల నష్టం వాటిల్లగా.. ఇందులో ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రోడ్లకే రూ.525 కోట్ల నష్టం ఏర్పడింది. నష్ట పరిహారాన్ని గతం కంటే 15 శాతం పెంచి ఇస్తాం.
 
పరిహారం అందించే క్రమంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలి. పంట నష్టపోయిన రైతులకు, ఇళ్లు ధ్వంసమైన బాధితుల్లో ఒక్కో కుటుంబానికి రూ.2వేలను అదనంగా ఇవ్వాలి. నిత్యావసర సరుకుల à°•à°¿à°‚à°¦ 25 కేజీల బియ్యం, లీటర్‌ పామాయిల్‌, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, బంగాళదుంపల పంపిణీని వెంటనే ప్రారంభించాలి. ఇళ్లు కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల కంటే ముందుగానే ఇళ్లు ఇస్తాం. వరద ముంపునకు 17 మండలాలు అధికంగా నష్టపోయాయి. ఇందులో 33 వేల హెక్టార్ల వ్యవసాయ, 2 వేల హెక్టార్ల ఉద్యానవన పంటలు మునిగాయి. à°ˆ క్రమంలో నష్ట పరిహారం చెల్లింపుతో పాటు భవిష్యత్‌లో కుందూ నదికి వరద వచ్చినా ముంపు ప్రమాదాలు ఎదురవ్వకుండా చేపట్టాల్సిన చర్యలపై పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాలి’ అని అధికారులకు ఆదేశించారు. వరద బాధితుల కోసం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటుచేయాలని, బాధితులంతా à°† సెల్‌ ద్వారా సమస్యలకు పరిష్కారం పొందేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ను నిర్దేశించారు.
 
42 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డులను పరిశీలిస్తే ఏటా 1,200 టీఎంసీల నీరు శ్రీశైలానికి వచ్చిన చరిత్ర ఉండగా.. à°—à°¤ ఐదేళ్ల రికార్డుల ప్రకారం à°† లెక్కలు 400 టీఎంసీలకే పరిమితమయ్యాయని జగన్‌ తెలిపారు. ‘ఆలమట్టి డ్యాం ఎత్తును 519 నుంచి 524 అడుగులకు పెంచితే శ్రీశైలానికి రావలసిన జలాల్లో వంద టీఎంసీలు కోల్పోవాల్సి వస్తుంది. à°ˆ సమస్యను పరిష్కరించడంలో భాగంగా గోదావరి జలాలను శ్రీశైలం తరలించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చించా. గతంలో శ్రీశైలానికి వరద ఏడాదిలో 190 రోజులు వచ్చేది. డ్యాములు నిండేవి. ఇప్పుడు కేవలం 40 రోజులే వరద వస్తోంది. అయినా డ్యాములు నింపేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుమ్మనూరు జయరాం, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు