గాలికొండ కమిటీ సభ్యుడు హరి హతం

Published: Monday September 23, 2019
విశాఖ ఏజెన్సీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. గూడెం కొత్తవీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ కొండజర్త అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు హరి అలియాస్‌ భాస్కరరావు సహా మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలిసింది. పోలీసు వర్గాల సమాచారం మేరకు... గూడెంకొత్తవీధి మండలం కొండజర్త అటవీప్రాంతంలో సుమారు 20మంది మావోయిస్టులు సమావేశమైనట్టు రెండురోజుల క్రితం సమాచారం అందింది. దీంతో గ్రేహౌండ్స్‌ బలగాలు ప్రణాళిక ప్రకారం అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మధ్యాహ్నం 12à°—à°‚à°Ÿà°² సమయంలో వారికి గాలికొండ ఏరియా కమిటీ తారసపడింది. ఇరువర్గాల మధ్య సుమారు 40నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోవడంతో బలగాలు à°† ప్రాంతాన్ని గాలించగా వేర్వేరు ప్రదేశాల్లో à°’à°• పురుషుడు, ఇద్దరు మహిళల మృతదేహాలు కనిపించాయి. మృతుడు గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు హరిగా గుర్తించారు. మహిళా మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలంలో ఎస్‌ఎల్‌ఆర్‌, రెండు 303, à°’à°• 12 బోర్‌ రైఫిల్‌, ఆరు కిట్‌బ్యాగులు, ల్యాండ్‌మైన్‌ లభ్యమయ్యాయి. ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం కొండజర్త అటవీ ప్రాంతాన్ని గ్రేహౌండ్స్‌తో పాటు స్పెషల్‌ పార్టీ, సీఆర్‌పీఎఫ్‌ దళాలు జల్లెడపడుతున్నాయి. ఎదురుకాల్పుల్లో మరికొంత మంది మావోయిస్టులు గాయపడి ఉంటారని పోలీసు వర్గాల అంచనా. మృతిచెందిన వారంతా గాలికొండ దళానికి చెందినవారిగా భావిస్తున్నామని విశాఖ రూరల్‌ ఎస్పీ అట్టాడ బాబూజీ తెలిపారు. పూర్తి వివరాలు సోమవారం తెలిసే అవకాశం ఉందన్నారు.
 
గతేడాది సెప్టెంబరు 23à°¨ డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద అప్పటి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్యచేశారు. à°ˆ ఘటన జరిగి సోమవారానికి ఏడాది. అప్పుడు మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే సమయంలో జీకేవీధి మండలంలో ఎదురుకాల్పులు జరగడం, ముగ్గురు మావోయిస్టులు మృతిచెందడంతో లివిటిపుట్టు ఘటనకు పోలీసు లు బదులిచ్చినట్లయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.