ఇసుక తెచ్చిన తంటా అంత ఇంతా కాదు

Published: Tuesday September 24, 2019
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇసుక కొరతను అధిగమించేందుకు గనుల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. అన్ని జిల్లాల్లో కొరత తీవ్రంగా ఉన్నా.. ఇసుక విధానం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కేవలం లక్ష క్యూబిక్‌ మీటర్ల ఇసుకను మాత్రమే వినియోగదారులకు అందించగలిగారు. విశాఖపట్నంలో ఇసుక కొరత వల్ల ప్రజల్లో చెడ్డపేరు వస్తోందని స్వయంగా వైసీపీ నేతలే వాపోయే పరిస్థితి వచ్చింది. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి.. ఎక్కడ చూసినా ఇసుక కష్టాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. à°ˆ పరిస్థితులన్నింటిపైనా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారమిక్కడ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి రాంగోపాల్‌, ఏపీఎండీసీ à°Žà°‚à°¡à±€, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద తగ్గగానే కొరత లేకుండా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విశాఖకు ఇసుక సరఫరా కోసం శ్రీకాకుళం జిల్లాలో కొన్ని రీచ్‌లను గుర్తించారు. అదేవిధంగా విజయనగరం జిల్లా నాతవరం దగ్గర కూడా à°’à°• రీచ్‌ను గుర్తించారు. à°ˆ రీచ్‌à°² నుంచి విశాఖ నగరానికి మాత్రమే ఇసుక సరఫరా చేయాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి à°ˆ సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు.
 

చిత్తూరు, తిరుపతికి ఇసుక సరఫరా చేయడానికి ప్రస్తుతం ఒకే ఒక్క రీచ్‌ ఉండడంతో.. ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నా ఒక్క ట్రిప్‌ కూడా పడక.. నష్టం వస్తోందని ట్రాక్టర్ల యజమానులు బంద్‌ చేస్తున్నారు. నగరి మండలంలో కొన్ని థర్డ్‌ గ్రేడ్‌ ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఏకాంబర కుప్పం ప్రాంతంలో కొన్ని రీచ్‌లు గుర్తించారు. రెండ్రోజుల్లో వాటి నుంచి ఇసుక సరఫరా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. à°« రాజమహేంద్రవరానికి ఇసుక సరఫరా చేసేందుకు తుని సమీపంలో కొన్ని రీచ్‌లను గుర్తించారు. వరద తగ్గేవరకు అవసరమైతే అక్కడి నుంచి ఇసుక సరఫరా చేయాలని నిర్ణయించారు. à°•à°°à±à°¨à±‚లు జిల్లాలో కూడా కొన్ని కొత్త రీచ్‌లు గుర్తించామని, అక్కడి నుంచి ఇసుక అందిస్తామని అధికారులు తెలిపారు.నెల్లూరు జిల్లాలో వరద లేదని, అక్కడి రీచ్‌à°² నుంచి అవసరమైతే ఇతర ప్రాంతాలకు కూడా ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అనుకున్నారు.పట్టా భూముల రీచ్‌లలోనూ త్వరలో తవ్వకాలు మొదలుపెట్టాలని నిర్ణయించారు.

మరోవైపు ఇసుక విధానం అమల్లోకి వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు కేవలం లక్ష క్యూబిక్‌ మీటర్ల ఇసుకను మాత్రమే సరఫరా చేయగలిగారు. స్టాక్‌పాయింట్లలో తగిన నిల్వలు పెట్టేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం, ఈలోగా వరదలు రావడంతో ఇబ్బందులు తలెత్తాయి. కృష్ణా, గోదావరి నదుల్లో వరద తగ్గగానే కొరత లేకుండా ఇసుక సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 102 ఇసుక రీచ్‌లు, వాటికి సంబంధించిన 52 స్టాక్‌ పాయింట్లలో ప్రస్తుతం 41 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు ఆయనకు తెలిపారు. జిల్లాల వారీగా ఇసుక నిల్వలను మంత్రి సమీక్షించారు. అయితే à°ˆ నిల్వలు డిమాండ్‌కు తగ్గట్లుగా లేవని అనుకున్నారు. వరద నీరు తగ్గేందుకు మరో 10 రోజులైనా సమయం పడుతుందని...à°† తర్వాత వేగంగా చర్యలు తీసుకుని.. ఇసుక సరఫరా కోసం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.