ఇంకా ముఖ్యమంత్రి మౌనం ఎందుకు?

Published: Tuesday September 24, 2019
 ‘‘మీ సీఎం ఎప్పుడూ చెప్పే విలువలు, విశ్వసనీయత నిజంగా ఉంటే... చేసిన తప్పులు సరిచేసుకుని లీకు వీరులపై చర్యలు తీసుకోమనండి. అంతేతప్ప కుల రాజకీయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దు’’అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘గౌరవ ఉప ముఖ్యమంత్రులు గార్లూ! తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకు గడ్డికోయడానికి అన్నాడట వెనకటికెవరో మీలాంటివారే. ప్రశ్నపత్రం లీక్‌పై చర్యలు తీసుకోండని లేఖ రాస్తే... కులాల కలరింగ్‌ ఇస్తున్నారు. కడుపుకి అన్నం తింటున్నారా? లేక అవినీతి భోంచేస్తున్నారా?’’ అంటూ ఘాటుగా స్పందించారు.
 
‘‘మీ వైసీపీ కార్యకర్తల కోసం 18 లక్షల మందిని ముంచేశామని, మీ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డే నర్మగర్భంగా ప్రకటిస్తుంటే... ఇంకా ముఖ్యమంత్రి మౌనం ఎందుకు? ప్రశ్నాపత్రం లీకైంది నిజం. ప్రతిభావంతులకు అన్యాయం జరిగింది వాస్తవం’’ అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. దార్శనికుడు భవిష్యత్‌ తరాల గురించి ఆలోచిస్తాడు à°’à°• నాయకుడు ప్రస్తుత పరిస్థితి గురించి మాత్రమే ఆలోచిస్తే... దార్శనికుడు మాత్రం భవిష్యత్‌ తరాల గురించి కూడా ఆలోచిస్తాడు. చంద్రబాబు అదే చేశారు. 20ఏళ్ల క్రితం భవిష్యత్‌ తరాల కోసం ఆలోచించి హైటెక్‌సిటీ నిర్మించారు. దానితో ఆరంభమైన హైదరాబాద్‌ ఐటీ ప్రస్థానం చివరకు à°† నగరాన్ని కాస్మొపాలిటన్‌ మహానగరంగా మార్చింది. బ్రేవో చంద్రబాబు! అని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.