తప్పు చేసినవారు ఎప్పటికైనా శిక్షార్హులే

Published: Friday September 27, 2019
 à°µà±ˆà°¸à±€à°ªà±€ నేతలు, à°…ధికారులు చట్టాలను ఉల్లంఘిస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నారని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తప్పు చేసినవారు ఎప్పటికైనా శిక్షార్హులేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఒత్తిడి చేస్తే తప్పులు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. స్వార్థం కోసం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రాష్ట్రానికి రూ. 7,500 కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన లేదని, ఎవరు చెప్పినా పట్టించుకోదని, మూర్ఖంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరువల్ల 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.
 
గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షల్లో అవకతవకలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. పీపీఏలపై కేంద్రమంత్రి లేఖరాసినా జగన్ పట్టించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు.