రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు

Published: Sunday September 29, 2019
రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొన్నాళ్లుగా సాగుతున్న నిరసనల సెగ మంత్రులను తాకింది. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సమావేశ భవనంలో మంత్రులు నిర్వహిస్తున్న సమీక్షను విద్యార్థి సం ఘాలు ముట్టడించాయి. లోపల సమీక్ష జరుగుతుండగానే భారీ సంఖ్యలో సంఘాల నాయకులు, విద్యార్థులు లోపలికి దూసుకు రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో à°‰ ద్రిక్తత నెలకొంది. సీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాయలసీమ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు బైఠాయించారు. బయటకు వచ్చి à°¨ మంత్రులను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
 
శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం.. సీమలో హైకోర్టుతో పాటుగా రెండో రాజధాని కూడా ఏర్పాటుచేయాలని రాయలసీమ విద్యార్థి యువజన జాయిం ట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ మల్లెల భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. శ్రీబాగ్‌ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాయలసీమ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో à°•à°¡à°ª పాత బస్టాండు నుంచి కోటిరెడ్డి సర్కిల్‌ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాజధాని, హైకోర్టులో ఏదో à°’à°•à°Ÿà°¿ కోరుకుంటున్నామని.. ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో రెండూ కావాలని అడుగుతామని స్పష్టం చేశారు