యురేనియం కోసం గుట్టుగా సర్వేలు

Published: Sunday September 29, 2019
ఊహించని ప్రమాదం à°Šà°°à°¿ పొలిమేరను చేరింది. యమపాశం పంట భూముల్లో తిష్ట వేసింది. భూగర్భాన్ని చీల్చుకుంటూ వెళ్తున్న మర యంత్రాలు యురేనియం జాడ కోసం వెతుకులాడుతున్నాయి. బోరు తవ్వకాల పేరిట పది రోజులుగా కర్నూలు జిల్లాలో à°ˆ వేట కొనసాగుతోంది. ఇప్పటికే à°•à°¡à°ª ప్రజల బతుకుల్లో ‘యురేనియం’ విషం చిమ్ముతోంది. ఇంతలోనే మరో రాయలసీమ జిల్లాను కూడా à°ˆ ముప్పు తాకనున్నట్టు వార్తలు వస్తుండటం, అధికారుల హడావుడి కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. తమ భూముల్లో సర్వే తవ్వకాలు జరుపుతున్న ప్రైవేటుసంస్థకు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. ‘లేదు.. యురేనియం ప్రయత్నాలు జరపడం లేదు’ అని అప్పటిదాకా దాటేసిన à°† సంస్థ ప్రతినిధులు... మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రైతుల తరఫున గట్టిగా నిలదీయడంతో గుట్టు బయటపడింది.
 
తాత్కాలికంగా సర్వే తవ్వకాలు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లాలోని యాదవాడ గ్రామ పరిసరాల్లో పది రోజులుగా అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నారు. ఆరా తీసిన వారికి, తాము ఢిల్లీకి చెందిన సౌత్‌ వెస్ట్‌ పినాకిల్‌ అనే సంస్థ తరఫున పనిచేస్తున్నామని చెప్పారు. మొదట్లో కాలువ ఒడ్లు, పొలం గట్ల దగ్గర పాయింట్లు వేసేవారు. అవి ఎందుకని రైతులు అడిగితే.. బోరు తవ్వకాలు చేపడుతున్నామని చెప్పేవారు. సరేలే అని రైతులు పెద్దగా పట్టించుకోలేదు. క్రమంగా తమ కార్యకలాపాలను వారు పెంచడం మొదలుపెట్టి, ఇప్పుడు రైతుల పొలాల్లోకి అడుగుపెట్టారు. పంట భూముల్లో పాయింట్లు వేయడానికి అనుమతించాలంటూ రైతులతో మాట్లాడుతున్నారు. అయితే, వారి అంగీకారం, అనంగీకారంతో సంబంధం లేకుండా, పొలాల్లో పాయింట్లు వేసుకొంటూ పోతున్నారు. ఇలా à°ˆ సర్వే తవ్వకాలు బాచిపల్లె, మిట్టపల్లె, కృష్ణాపురం సహా 20 గ్రామాల్లో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 17 ప్రాంతాల్లో à°ˆ సర్వే శిబిరాలు చొచ్చుకుపోయాయన్న విషయం రైతులు, స్థానికుల్లో కలకలం రేపుతోంది.
 
 
ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామ పరిసరాల్లో కాల్వ గట్లపై బోర్లు కోసమని తవ్వకాలు మొదలుపెట్టారు. ఒక్కో పాయింట్లో 22-25 మంది సిబ్బంది రోజుకు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. మూడ్రోజులకోసారి కొన్ని రాళ్ల నమూనాలను వెలికితీసి, ఐరన్‌ బాక్సుల్లో పెట్టి ఎక్కడెక్కడికో తరలిస్తున్నారు. కాలువ గట్లపై ఏదో చేసుకొంటున్నారులే అని రైతులూ మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. అయితే, రెండురోజుల క్రితం యాదవాడకు చెందిన కొట్టం à°šà°¿à°¨ నరసింహులు అనే రైతుకు చెందిన పట్టా భూమిలో ఆయనకు తెలియకుండానే పాయింట్లను ఏర్పాటుచేశారు. దీనిపై గ్రామ రైతులంతా ఏకమై వారిని నిలదీశారు. ‘‘మీ దగ్గర వెలికితీసిన రాళ్లను పరీక్షల నిమిత్తం పంపిస్తున్నాం.
 
 
అయితే à°† పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు? à°† రాళ్లలో à°Žà°‚à°¤ శాతం యురేనియం వచ్చిందన్న వివరాలు మాకు తెలియదు. ఒక్కో పాయింట్లో సుమారు పది వేల అడుగుల లోతు వరకు తవ్వి నమూనాలను సేకరించాలని మా సంస్థ మాకు చెప్పింది. ఇప్పటి వరకు యాదవాడ పాయింట్లో 200 మీటర్ల మేర (దాదాపు 600 అడుగులు) తవ్వి నమూనాలను జరిపాం. 30 బాక్సుల్లో అక్కడ సేకరించిన రాళ్లను మా ఉన్నతాధికారులకు పంపించాం. 8 నెలల వరకు à°ˆ కాంట్రాక్టు ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కో పాయింట్లో 20 రోజుల వరకు పనిచేస్తాం’’ అని వారు తెలిపారు. యురేనియం విష పదార్థాలు భూగర్భ జలాల్లో కలిస్తే పశువులూ, మనుషులూ ఎవరూ మిగలదని రైతులు, స్థానికులు కలవరపడుతున్నారు.
 
తాత్కాలికంగా డ్రిల్లింగ్‌ ఆపిన ప్రతినిధులు... రైతులను నయానో, భయానో ఒప్పించి తమ పనిని చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఇంతలో బాధిత రైతులకు మద్దతుగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ à°† ప్రాంతానికి శనివారం వచ్చారు. à°ˆ విషయం ముందే తెలియడంతో.. అధికారులు, సంస్థ ప్రతినిధులు అప్రమత్తం అయ్యారు. అప్పటిదాకా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిపిన వారల్లా... సర్వే పనులకు అనుమతి కోరుతూ హడావిడిగా తహసీల్దార్‌కు లేఖ పంపారు. జాతీయ అణుశక్తి సంస్థ తరఫున పనిచేసే ప్రైవేటు కంపెనీ తరఫున వారు à°† లేఖ రాయడం గమనార్హం. అఖిలప్రియ ఘటనాస్థలిలో రైతులతో మాట్లాడారు. అనంతరం సంస్థ ప్రతినిధులతోనూ, ప్రభుత్వాధికారులతోనూ మాట్లాడారు. à°† సంస్థ నుంచి అనుమతులు కోరుతూ రెండురోజుల క్రితం à°“ లేఖ వచ్చిందే తప్ప తాము ఎలాంటి అనుమతులను ఇవ్వలేదని సదరు అధికారులు ఆమెకు తెలిపారు. పది రోజుల నుంచి జరుగుతున్న పనులకు రెండురోజుల క్రితం అనుమతులు కోరడమేంటని ఎమ్మార్వోని ఆమె నిలదీశారు.