టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అరెస్ట్

Published: Saturday October 05, 2019
 à°Ÿà±€à°µà±€9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పదిమంది పోలీసుల బృందం రవిప్రకాష్ ఇంటికి వెళ్లి... కారణం చెప్పకుండా అరెస్టు చేసి తీసుకెళ్లింది.  రవిప్రకాష్‌, మూర్తి, ఫెరీరియోలపై టీవీ9 కొత్త యాజమాన్యం బంజారాహిల్స్‌ పీఎస్‌లో à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ ఫిర్యాదు చేసింది. బోర్డు అనుమతి లేకుండా రూ.18.31 కోట్లను సొంత ఖాతాలకు మళ్లించారని ఆరోపించింది.
 
రికార్డుల పరిశీలనలో వెల్లడైన విషయాలపై పీఎస్‌లో యాజమాన్యం ఫిర్యాదు చేసింది. రవిప్రకాష్‌ దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని టీవీ9 యాజమాన్యం ఆరోపించింది. 41 సీఆర్‌పీసీ ప్రకారం రవిప్రకాష్‌కు బంజారాహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేయగా... వాటిని తీసుకునేందుకు రవిప్రకాష్‌ నిరాకరించారు. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు రవిప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
రవిప్రకాష్‌పై టీవీ9 ప్రస్తుత యాజమాన్యం అలందా మీడియా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం, సైబర్‌క్రైమ్‌ నేరాలకు పాల్పడ్డారంటూ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. à°ˆ కేసులకు సంబంధించి విచారణకు రవిప్రకాష్ హాజరై.. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.