అంతర్జాతీయంగా రాష్ట్రానికి మాయని మచ్చ

Published: Monday October 07, 2019
‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరాల్లో చండీగఢ్‌ à°’à°•à°Ÿà°¿. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుసుకున్నాను. రాజధాని అనేది ప్రభుత్వం కోసం కాదు.. ప్రజల కోసం. 10 లక్షల మంది ప్రజలు నివసించే నగరం నిర్మించడానికి దాదాపు 15 సంవత్సరాలు పడుతోంది. దీనికి రాజకీయ అంశం జోడించి నిర్మాణం ఆపడం సరికాదు’’ అని ప్రముఖ ఆర్కిటెక్ట్‌ కీర్తిషా అన్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా 62à°µ జోనల్‌ నాసా కన్వెన్షన్‌ జోన్‌-5 సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా అమరావతిపై ‘ఆంధ్రజ్యోతి’à°•à°¿ కీర్తిషా తన అభిప్రాయాలను వెల్లడించారు.
 
తెలుసు. ఇంత పెద్ద ప్రాజెక్టు చేపట్టడం చాలా ఆనందం. అయితే, అమరావతి రెండు దశలుగా చెప్పుకోవచ్చు. తొలుత శివరామకృష్ణ కమిటీ à°ˆ ప్రాంతం వద్దని చెప్పడం, అమరావతిలో పంట భూములు ఉండడం, వరద ముంపు.. ఇలా అనేక బాలారిష్టాలు దాటింది. ఎట్టకేలకు సింగపూర్‌ సహకారంతో డిజైన్‌ తయారవడం.. నిర్మాణాలు మొదలు.. ఇలా ప్రక్రియ అంతా తెలుసు.
 
రెండు రోజుల కిందట అమరావతిలో కలియదిరిగాను. అక్కడి వారితో మాట్లాడాను. ప్రస్తుతం à°ˆ ప్రాంతం ‘యుద్ధం ముగిసిన రణభూమిలా’ ఉంది. చాలా బాధనిపించింది. సగంలో నిలిచిపోయిన నిర్మాణాలతో à°…à°‚à°¤ విలువైన మెటీరియల్‌ అలాగే ఉండిపోయింది. అక్కడ చిన్న బడ్డీకొట్టు నడుపుతున్న ముస్లిం వ్యాపారితో మాట్లాడాను.. 5 నెలల కిందట రోజుకు రూ.2 వేల వ్యాపారం జరిగేదని, రూ.500 ఇంటికి తీసుకెళ్లేవాడినని.. ప్రస్తుతం రూ.500 అమ్మితే రూ.50 మిగులుతున్నాయని బాధపడ్డాడు. దీనిని బట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.
 
అమరావతి అనేది రాజకీయ అంశంగా మారింది. అది దురదృష్టం. రాజధాని ప్రజల కోసం. ప్రభుత్వం మారినంత మాత్రాన నిర్మాణాలు ఆపడం సబబు కాదు. à°ˆ సదస్సును ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్యతో à°ˆ విషయంపై మాట్లాడాను. దీనిపై ఆయన.. సీఎం జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పారు.