రికార్డులు బద్దలుకొట్టిన పాకిస్తాన్...

Published: Wednesday October 09, 2019
పాకిస్తాన్‌లో తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో à°† దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అందినచోటల్లా అప్పులు చేస్తున్నారు. ఆర్ధిక సాయం కోసం ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుండగానే.. అక్కడి పరిస్థితిని తేటతెల్లం చేస్తూ తాజాగా కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే à°‡à°®à±à°°à°¾à°¨à± ప్రభుత్వం 7,509 బిలియన్ల పాకిస్తానీ రూపాయల మేర  à°…ప్పులు చేసింది. దీంతో అత్యధిక అప్పులు చేసిన ప్రభుత్వంగా పాకిస్తాన్ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. స్థానిక మీడియా కథనం ప్రకారం à°ˆ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయానికి రుణాల వివరాలు పంపింది.
 
à°ˆ డేటా ప్రకారం.. 2018 ఆగస్టు నుంచి 2019 ఆగస్టు వరకు పాక్ ప్రభుత్వం విదేశాల నుంచి రూ.2,804 బిలియన్ల మేర అప్పులు తీసుకోగా.. దేశీయంగా రూ. 4,705 బిలియన్ల అప్పు చేసినట్టు తేలింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే పాకిస్తాన్ ప్రభుత్వ అప్పులు 1.43 శాతం పెరిగినట్టు తాజాగా గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఆగస్టులో రుణాలు రూ.24,732 బిలియన్లు ఉండగా.. à°ˆ ఏడాది ఆగస్టులో అప్పులు రూ.32,240 బిలియన్లుగా ఉన్నాయి. కాగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయల మేర పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇమ్రాన్ ప్రభుత్వం రూ. 960 బిలియన్ల మేర పన్నులు వసూలు చేసింది.మరోవైపు à°ˆ ఏడాది 2019 నాటికి పాకిస్తాన్ అప్పులు మొత్తం రూ. 31.786 ట్రిలియన్లకు చేరుకుంది. దీనికి అదనంగా మరో ఐదేళ్లలో 47 శాతం అంటే 45.57 ట్రిలియన్లకు పాకిస్తాన్ అప్పులు పెరగనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. సౌదీ అరేబియా, చైనా తదితర దేశాలు పాకిస్తాన్‌ను బెయిలవుట్ ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ.. దాయాది దేశ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడకపోవడం గమనార్హం. à°ˆ ఏడాది జూన్‌లో ఖతార్ నుంచి పాకిస్తాన్ 3 ట్రిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజి అందుకుంది. à°—à°¤ 11 నెలల్లో పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ముందుకొచ్చిన గల్ఫ్ దేశాల్లో ఖతార్ నాలుగోది. అంతకు ముందు యూఏఈ కూడా 2 ట్రిలియన్ డాలర్ల మేర సొమ్ములు సమకూర్చింది. à°®à°°à±‹à°µà±ˆà°ªà± à°¤à°® ఆర్ధిక వ్యవస్థను సంక్షోభం నుంచి గాడిలో పెట్టేందుకు పాక్ ప్రభుత్వం  6 బిలియన్ డాలర్ల ఉద్ధీపన ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ప్రాథమిక ఒప్పందం చేసుకుంది