కృష్ణాలో దొంగ బాబా వీరంగం

Published: Friday October 11, 2019
: జాతకాల పేరుతో మహిళలను లొంగదీసుకుంటాడు. మహర్దశ పడుతుందంటూ, డబ్బులతోపాటు కార్లు, బంగారం, వెండి వస్తువులు అన్నింటినీ లాగేస్తాడు. జాతకం చెప్పించుకున్న వాళ్లకి మహర్దశ పట్టడం సంగతి పక్కనపెడితే ఊరంతా అప్పులు మిగులుతున్నాయి. ఆయన ‘చెయ్యి చూస్తే మసే’ అని తేల్చుకొని నిలదీస్తే.. కొందరు పోలీసులు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పి, వారితో తనకు సంబంధాలు ఉన్నాయంటూ బెదరగొట్టేస్తాడు. దీంతో బాధితులు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కిమ్మనకుండా ఉండిపోతారు. కొందరు తెగించి పోలీసులను ఆశ్రయించినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు! బాధితుల కథనం ప్రకారం.. విజయవాడ భవానీపురంలో జ్యోతిషాలయం నిర్వహిస్తున్న à°“ దొంగ బాబా ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఈయన ఒకప్పుడు చిలక జోస్యం చెప్పేవాడు.
 
à°† స్థాయి నుంచి నేడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు జ్యోతిష్యాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. ఈయన కుమారుడు స్థానికంగా వైసీపీ నేతగా చలామణి అవుతున్నాడు. తాను.. సీఎం జగన్‌ ఒకే సామాజికవర్గం అని, జగన్‌ తనకు అత్యంత సన్నిహితుడని తన వద్దకు వచ్చేవారికి దొంగబాబా సెలవిస్తుంటాడు. సామాన్య భక్తుల కళ్లెదుటే మంత్రులకు ఫోన్‌చేసి మాట్లాడతాడు. రూ.26లక్షలు విలువ చేసే ఫ్లాటును కబ్జా చేసేందుకు కొద్ది రోజుల క్రితం దొంగ బాబా తెగబడ్డాడు. అయితే ఫ్లాటు ఓనర్లయిన వృద్ధ దంపతులు à°Žà°‚à°¤ వేధించినా ఫ్లాటును వదిలేది లేదంటూ తెగువ చూపడంతో బాబా ఆటలు సాగలేదు. ఇటీవల తెలంగాణకు చెందిన à°“ మహిళ బాబా చేతిలో శారీరకంగా.. ఆర్థికంగా అన్ని రకాలుగా మోసపోయి పోలీసులను ఆశ్రయించింది. ‘నీ జాతకం అద్భుతంగా ఉంది. నీ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టిస్తా.
 
ఏడాదిలో నీవు కోటీశ్వరురాలివైపోతావు’ అంటూ దొంగ బాబా ఆమె నుంచి విడతలవారీగా రూ.50 లక్షలు తీసుకున్నాడు. à°† మహిళకు చెందిన కారు, బంగారు, వెండి వస్తువులను కూడా స్వాహా చేశాడు. లైంగికంగాను ఆమెను వేధింపులకు గురిచేశాడు. నెలలు గడుస్తున్నా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ జాడ లేకపోవడంతో బాధితురాలు తాను అన్ని రకాలుగా మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు రోజులు గడిపేస్తుండటంతో బాధితురాలు ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించింది. బాధితురాలి కేసు విషయమై ఆరా తీయగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షాత్తు కృష్ణా జిల్లాకు చెందిన à°“ మంత్రి జోక్యం చేసుకోవడంతో పోలీసులు దొంగ బాబాపై కేసు నమోదుకు మీనమేషాలు లెక్కిస్తున్నట్టు తేలింది.