ఆరోపణలు అన్నీ నిజం కాదు- డీజీపీ

Published: Tuesday October 15, 2019
 à°à°ªà±€ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో à°ˆ కేసుపై పలు రకాల ప్రచారాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. à°ˆ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజాగా à°† విషయంపై స్పందించారు. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో వస్తున్న ఆరోపణలు నిజం కాదని చెప్పారు. కేసు విచారణ సమర్థవంతంగా, సక్రమంగా జరుగుతోందని స్పష్టం చేశారు. రాజకీయ నేతలు మాట్లాడే మాటలను తాము పట్టించుకోబోమన్నారు. పోలీసులు వాళ్ల పని వాళ్లు చేస్తారని తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల కార్యక్రమంలో మాట్లాడుతూ డీజీపీ à°ˆ వ్యాఖ్యలు చేశారు.
 
మావోయిస్టులపై కూడా డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ సందర్భంగా స్పందించారు. రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం బాగా తగ్గిందని, ప్రజల్లో కూడా మావోల భావజాలం పూర్తిగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. డెమోక్రసీ ద్వారా మాత్రమే మార్పు వస్తుందని, హింస ద్వారా ప్రజాస్వామ్యం రాదని హితవు పలికారు. మావోయిస్టు నేత అరుణ పోలీసుల అదుపులో ఉన్నట్లు వస్తున్న ప్రచారం నిజం కాదని చెప్పారు. పోలీసుల అదుపులో ఏ మావోయిస్టు కూడా లేరని డీజీపీ స్పష్టం చేశారు.