‘పోలవరం’పై కఠినంగా కేంద్ర ప్రభుత్వం

Published: Tuesday October 15, 2019
 ‘పోలవరం సాగునీటి ప్రాజెక్టును 2022లోగా పూర్తిచేయాలన్న ప్రధాన లక్ష్యంలో ఎలాంటి మార్పూలే దు. కానీ à°ˆ ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, చేస్తున్న ఖర్చుల లెక్కలు తేల్చకపోతే మాత్రం తలాడించేందుకు సిద్ధంగా లేము. 2014కు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతిపైసా లెక్క తేలాల్సిందే. అప్పటి వరకూ రూ.5 వేల కోట్లను ఖర్చు చేశామంటోన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు ఆధారాలు చూపాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక ఆడిట్‌ నివేదికలను అందజేయకపోతే.. కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు’ అని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తేల్చి చెప్తోంది. పైగా.. ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను ఇక పై రాష్ట్ర ప్రభుత్వంతో సహా కేంద్రమూ చేపడుతుందని స్పష్టం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు పనులను నిరంతరం స్వీయ పర్యవేక్షణ చేపట్టేందుకు వీలుగా హైదరాబాద్‌ నుంచి మకాం మార్చే సి.. రాజమండ్రిలో లేదా కొవ్వూరులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
 
ఇందుకు కార్యాచరణ ప్రణాళికనూ కేంద్రం సిద్ధం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కఠినవైఖరిని అవలంబించే యోచనలో కేంద్రం ఉంది. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో రాష్ట్ర బీజేపీ నేతల బృందం ఆదివారం ఢిల్లీలో సమావేశమై ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా నిర్మాణ బాధ్యత ను కేంద్రమే తీసుకోవాలని కోరింది. గతంలో ప్రతిపక్ష నేతగా కేంద్రానికి జగన్‌ సమర్పించిన వినతిపత్రాలను షెకావత్‌కు బీజేపీ నేతలు అందచేశారు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ చేసిన డిమాండ్‌ను ఇప్పుడు అమలు చేయాలంటూ కేంద్రంపై రాష్ట్ర బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల కేంద్రం అసంతృప్తితో ఉందని రాష్ట్ర బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభు త్వ యోచనపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చింది. పీపీఏ కూడా రివర్స్‌ టెండరింగ్‌కు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని రాష్ట్రాన్ని కోరింది. కాగా, à°ˆ నెల 16à°¨ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్వహించాలని భావించినా దానిని à°ˆ నెల 21à°µ తేదీకి మార్చారు.