రాష్ట్ర విద్యుత్‌ సంస్థలపై మరో పిడుగు

Published: Tuesday October 15, 2019
రాష్ట్ర విద్యుత్‌ సంస్థలపై మరో పిడుగు పడింది. సౌర, పవన విద్యుత్‌ కంపెనీలకు కూడా ముందస్తు చెల్లింపులకు సంబంధించిన(లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌-ఎల్‌సీ)లు ఇవ్వాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. రెండు రోజుల్లో వీటిని జారీ చేసి తమకు సమాచారం అందచేయాలని కేంద్ర ఇంధన శాఖ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు లేఖ రాసింది. లేని పక్షంలో జాతీయ విద్యుత్‌ ఎక్స్ఛేంజ్‌ నుంచి బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు చేయకుండా రాష్ట్రంపై నిషేధం విధించే పరిస్థితి వస్తుందని అందులో హెచ్చరించింది. ఇటీవలే ఒకసారి ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలుపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో వారంపాటు రాష్ట్రాన్ని కరెంటు కోతలు అల్లాడించాయి. రోజుకు నాలుగు నుంచి ఆరు గంటలపాటు పలు ప్రాంతాల్లో కోతలు విధించాల్సి వచ్చింది.
 
దీంతో కేంద్రం తాజా ఆదేశాలు విద్యుత్‌ శాఖ వర్గాలను మళ్లీ గడగడలాడిస్తున్నాయి. విద్యుదుత్పత్తి చేసి సరఫరా చేసే కంపెనీలకు రాష్ట్రాలు నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో à°ˆ పరిస్థితిని కేంద్రం సీరియ్‌సగా తీసుకుంది. బకాయిలు పేరుకుపోవడంతో à°† కంపెనీలు బ్యాంకులకు రుణాలు చెల్లించలేకపోతున్నాయి. దీంతో బ్యాంకులు కూడా క్లిష్ట పరిస్థితిలో కూరుకుపోతున్నాయి. à°ˆ పరిస్థితిని నివారించడానికే కేంద్రం ఎల్‌సీల విధానం తీసుకొచ్చింది. దీని ప్రకారం విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీలకు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలు à°’à°• వారం లేదా నెలకు సంబంధించిన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ మంజూరు చేయాలి. 45 రోజుల్లో వీటిని à°† కంపెనీలు నగదుగా మార్చుకుంటాయి. ప్రతి వారం లేదా ప్రతి నెలా ఎల్‌సీలను ఇచ్చి తీరాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. à°ˆ ఆదేశాలు తప్పనిసరి కావడంతో ముందుగా కేంద్ర విద్యుత్‌ సంస్థ ఎన్‌టీపీసీకి సంబంధించిన విద్యుత్‌ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌సీలివ్వడం మొదలుపెట్టింది. దీనికి నెలకు సుమారుగా రూ.550 కోట్లు వ్యయమవుతోంది.
 
అయితే ప్రైవేటు విద్యుత్‌ కంపెనీలకు ఎల్‌సీలివ్వకపోవడంతో వాటిలో à°’à°• ప్రైవేటు థర్మల్‌ విద్యుత్‌ కంపెనీ రాష్ట్రంపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. à°ˆ ఫిర్యాదు దెబ్బకు విద్యుత్‌ ఎక్స్ఛేంజ్‌లో రాష్ట్రంపై కేంద్రం నిషేధం విధించింది. దానితో à°† కంపెనీకి కూడా ఎల్‌సీ జారీ మొదలుపెట్టారు. సౌర, పవన కంపెనీలకు మాత్రం ఇంతవరకూ లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇవ్వలేదు. దీనిపైనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. à°ˆ ఆదేశాలను పవర్‌ సిస్టం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రానికి పంపింది.