‘మోదీపై గల్లా, బాలయ్యతో విమర్శలు

Published: Thursday October 17, 2019
జిల్లాలోని వేమూరులో గాంధీ సంకల్ప యాత్రను బీజేపీ నేత సోము వీర్రాజు ప్రారంభించారు. à°ˆ కార్యక్రమంలో రావెల కిశోర్ బాబు, దర్శనపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. యాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. à°ªà±à°°à°§à°¾à°¨à°¿ మోదీపై వ్యక్తిగత విబేధాలు లేవని చంద్రబాబు ఎలా అంటారు.? మోదీ మెడలు వంచుతామన్నది నిజం కాదా?. గల్లా జయదేవ్, బాలకృష్ణతో విమర్శలు చేయించింది నిజం కాదా?. రాజధాని శంఖుస్థాపనకు పవిత్ర జలాలు తెస్తే కించపర్చింది నిజం కాదా? . పొత్తులో ఉండగానే మోదీ దిష్టి బొమ్మలు దగ్గం చేయించలేదా?. మోదీని తిట్టడానికి ధర్మదీక్షలు పెట్టలేదా?. బీజేపీపై రెబల్స్‌ని నిలిపింది నిజం కాదా?. బీజేపీ ఎదుగుతుండటంతో బాబులో భయం పెరిగింది. అందుకే మరల బీజేపీలో చేరడానికి బాబు దారులు వెతుక్కుంటున్నారు’ à°…ని సోమువీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు.
 
అంతటితో ఆగని ఆయన.. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చేనేతకు డబ్బులు ఇవ్వడం కాదని వారి బతుకులు మార్చడానికి సర్కార్ కృషి చేయాలన్నారు. చేనేతకు గతంలో ఇవ్వాల్సిన 120 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ సొమ్ము పప్పు బెల్లంలా పంచిపెట్టడంతో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని సోము వీర్రాజు జోస్యం చెప్పారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే పని చేస్తోందని.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కూ అదే గతి పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. గాంధీ ఆశయాలకు, ఆదర్శాలు మాటల్లో కాదు చేతల్లో చూపించాలని సోము వీర్రాజు తెలిపారు.