‘రాజన్న రాజ్యం పేరుతో రాష్ట్రంలో పోలీసు రాజ్యం

Published: Wednesday October 23, 2019

‘‘రాజన్న రాజ్యం పేరుతో రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. ఎన్‌జీ à°°à°‚à°—à°¾ విశ్వవిద్యాలయం ఉపకులపతిపై అక్రమంగా కేసు బనాయించడమే ఇందుకు నిదర్శనం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. à°† పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గాంధీ సంకల్ప యాత్రలో హాజరయ్యేందుకు మంగళవారం ఆయన అనంతపురం వచ్చారు. à°ˆ సందర్భంగా బుక్కరాయసముద్రం మండలంలో à°† పార్టీ శ్రేణులతో కలిసి 5 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం మండల కేంద్రంలో బహిరంగ సభలో కన్నా మాట్లాడారు. బీజేపీలో చేరే వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం దేవస్థానంలో అన్యమత ప్రచారంపై ఉద్యమించిన ఇద్దరిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేయించారని అన్నారు. అవినీతి, అరాచకాలు, హత్యలతో రాష్ర్టానికి తీవ్ర నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వైసీపీ కండువా కప్పుకోకపోతే కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పాలనపై సీఎం జగన్‌ పట్టు కోల్పోయారన్నారు. రాష్ట్రం బాగోగులు కోరే ఏ సీఎం అయినా కేంద్రంతో సఖ్యతగా ఉండాలని ఆయన జగన్‌ను ఉద్దేశించి హితవు పలికారు.