నేరాలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌ టెన్‌

Published: Wednesday October 23, 2019
నేరాలు-ఘోరాల విషయంలో దేశంలోని 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌ టెన్‌లో నిలిచింది. ముఖ్యంగా వృద్ధ తల్లిదండ్రులపై పైశాచికం ప్రదర్శిస్తున్న వారున్న రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. మహిళలు, దళితులపైనా దాడులు ఎక్కువగానే జరుగుతున్నాయి. à°ˆ మేరకు ఎన్‌సీఆర్బీ-2017 నివేదిక వెల్లడించింది. సైబర్‌ నేరాలు, మహిళలపై అత్యాచారాలు, ఆర్థిక మోసాలు వంటి వాటిలో ఏపీ 7à°µ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏటా నమోదైన కేసుల ఆధారంగా నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్బీ) మరుసటి ఏడాది ఆయా రాష్ట్రాల్లో నేరాల స్థాయిని అంచనా వేస్తూ నివేదిక విడుదల చేస్తుంది. తాజాగా 2017 క్రైం డేటాను ఎన్‌ఈఆర్‌బీ విడుదల చేసింది. దీనిలో బీహార్‌, యూపీ, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లు నేరాలు తీవ్రంగా జరుగుతున్న రాష్ట్రాల్లో ముందువరుసలో ఉన్నాయి. ఏపీ కూడా à°ˆ జాబితాలో టాప్‌ టెన్‌లో నిలిచింది. ఏపీలో వృద్ధులపై దాడులు బాగా పెరిగాయని, దళితులపై దాడులు ఎక్కువైనట్లు నివేదిక పేర్కొంది. దేశంలోని పలు వ్యభిచార కేంద్రాల్లో ఏపీ చెందిన యువతులు, మహిళలు విక్రయానికి గురయినట్టు నివేదిక స్పష్టం చేసింది.
 
మానవ అక్రమ రవాణాలో ఏపీ ఏడో స్థానంలో ఉంది. ఏపీ మహిళల్ని ఉపాధి పేరుతో కొన్ని ముఠాలు దేశం దాటిస్తున్నట్లు పేర్కొంది. సైబర్‌ నేరా నేరాల్లో దేశంలో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా ఏపీ 7à°µ స్థానంలో, మహిళలపై జరుగుతున్న నేరాల్లో 8à°µ స్థానంలో ఉంది. ఆర్థిక మోసాల్లో కూడా రాష్ట్రం ఆందోళనకర స్థానంలోనే ఉంది. గిరిజనులపై దాడుల విషయంలో 9à°µ ర్యాంకులో ఉంది. రాష్ట్రంలో వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో 2017లో జరిగిన హత్యల్లో 179 à°† కోవకు చెందినవేనని తెలిపింది. దేశ వ్యాప్తంగా 30,62,579 కేసులు ఐపీసీ à°•à°¿à°‚à°¦ నమోదు కాగా, వీటిలో మన రాష్ట్రంలో 1,32,336 కేసులు(4.3ు) రిజిస్టర్‌ కావడం గమనార్హం.