గరిష్ఠ సామర్థ్యానికి చేరిన రిజర్వాయర్లు

Published: Thursday October 24, 2019
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వేలాది హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. రహదారులపైకి వర్షంనీరు చేరడంతో పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. విశాఖ నగరంతో పాటు జిల్లాలోని చుట్టుపక్కల మండలాల్లో అనేకచోట్ల భారీనుంచి అతి భారీవర్షం కురిసింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రఽధాన మార్గంలో కేబీఆర్‌-2 జంక్షన్‌ వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో ఉక్కు ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాంబిల్లి, మునగపాక, ఎలమంచిలి మండలాల్లో 257 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. శారదా నది పొంగి ప్రవహిస్తోంది. జిల్లాలోని దాదాపు అన్ని రిజర్వాయర్లు గరిష్ఠ సామర్థ్యానికి చేరుకున్నాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, పెడన, కలిదిండి, గుడివాడ మండలాల్లో 12.22 హెక్టార్లలో వరి నీట మునిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ముసునూరులో 25 హెక్టార్లలో పత్తి, బాపులపాడులో 345.2 హెక్టార్లలో మినుము పంట నీట మునిగినట్టు లెక్క తేల్చారు. మచిలీపట్నం మండలంలోని తాళ్ళపాలెం, శిరివెళ్ళపాలెం, తదితర గ్రామాల్లో 100ఎకరాలకు పైగా వేరుశనగ నీట మునిగింది. 1.21 లక్షల ఎకరాల్లో మొదటి తీత దశలో పత్తి తడిసి ముద్దయింది. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోకి వాన నీరు చేరడంతో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ భక్తులు ఇబ్బందులు పడ్డారు. కోనసీమలోని 50à°•à°¿ పైగా ప్రభుత్వ పాఠశాలలు ముంపులోనే ఉన్నాయి.
 
ముమ్మిడివరంలోని హైస్కూల్‌, జూనియర్‌ కాలేజీలు మునిగిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాకినాడలో à°“ పాత భవనం కుప్పకూలింది. పిఠాపురం, గొల్లప్రోలు, బిక్కవోలు, మండపేట తదితర ప్రాంతాల్లో వరి నీట మునిగింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 45మండలాల్లో వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు à°“ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. పశ్చిమగోదావరి జిల్లాలో 3,691హెక్టార్లలో వరి చేలు నేలకొరిగాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూడిలంక రోడ్డు మళ్లీ కొట్టుకుపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సరుబుజ్జిలి మండలం బొప్పడాం గ్రామం వద్ద అలికాం-బత్తిలి ప్రధాన రహదారికి భారీ à°—à°‚à°¡à°¿ పడటంతో రాకపోకలు స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానిస్టేబుల్‌ చిరంజీవి, గ్రామస్థులు à°’à°• తాడును ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. భారీవర్షాల సమాచారంతో విజయనగరం జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వర్షానికి భోగాపురంలో తహసీల్దార్‌ కార్యాలయం శ్లాబు నుంచి నీరు చిమ్మడంతో కంప్యూటర్లు, రికార్డులు తడిసిపోకుండా సిబ్బంది గొడుగు పట్టుకుని విధులు నిర్వహించారు.