9674 వలంటీర్ల ఖాళీల భర్తీ

Published: Sunday October 27, 2019
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 9674 వలంటీర్ల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ప్రతి 50 కుటుంబాలకు à°’à°• వలంటీర్‌ చొప్పున రాష్ట్రంలో 1,92,964 వలంటీర్ల పోస్టులకుగాను, 1,83,290 వలంటీర్లను భర్తీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 9674 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. నోటిఫికేషన్‌ విడుదల చేసి ఆయా జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించాలన్నారు. ఆయా గ్రామానికి చెందిన కనీసం పదోతరగతి పాసైన వారిని వలంటీర్లుగా నియమించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఎక్కడైనా ఆయా రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యర్థులు లేకపోతే వేరే కేటగిరీకి చెందిన అభ్యర్థులతో భర్తీ చేయాలని, మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని, మొదట మండలం యూనిట్‌à°—à°¾ పరిగణించి à°ˆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మండల స్థాయిలో సంబంధిత కేటగిరీకి సంబంధించిన వారు లేకపోతే జిల్లా యూనిట్‌à°—à°¾ తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ అభ్యర్థులనే వలంటీర్లుగా నియమించాలని స్పష్టం చేశారు.
 
 
అదే గ్రామంలో అర్హత కలిగిన ఎస్టీ అభ్యర్థి లేకపోతే పక్క గ్రామంలో అర్హత కలిగిన ఎస్టీ అభ్యర్థితో భర్తీ చేయాలని సూచించారు. నవంబరు 1 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, 10à°µ తేదీ లోపు దరఖాస్తులు స్వీకరించి, 15à°µ తేదీ కల్లా పరిశీలన పూర్తి చేసి, 16 నుంచి 20à°µ తేదీ వరకు ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని షెడ్యూల్‌ ప్రకటించారు. ఎంపికైన వలంటీర్లకు 22à°µ తేదీ నాటికి లేఖలు పంపాలని, 29 నుంచి 30à°µ తేదీ వరకు ట్రైనింగ్‌ ఇచ్చి డిసెంబరు 1 కల్లా విధుల్లోకి చేరాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక నుంచి ఖాళీ అయ్యే వలంటీర్ల పోస్టులను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఎంపీడీవోలు భర్తీ చేయాలని, ఖాళీ వలంటీర్ల స్థానంలో పక్క వలంటీర్లకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. వలంటీర్ల పోస్టులు ఖాళీ అయిన రెండు నెలల్లోపు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ స్పష్టం చేశారు.