గ్రామ సచివాలయ నియామకాలు చేపట్టేందుకు ఏపీపీఏస్సీ,

Published: Tuesday October 29, 2019
 à°—్రామ సచివాలయాల్లో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేసే బాధ్యత ఎవరికి ఇవ్వాలన్న విషయంలో మీమాంస కొనసాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం... à°ˆ పోస్టుల నియామకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇటీవల వీటిని పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి జిల్లాలవారీగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రశ్నపత్రం రూపొందించే బాధ్యతను ఏపీపీఏస్సీకి అప్పగించింది. అయితే... ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. గ్రామ సచివాలయాల్లో 1,34,000 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా, కొందరు ఉద్యోగాల్లో చేరకపోవడం, మరికొన్ని పోస్టులకు అర్హులు లేకపోవడంతో దాదాపు 25వేల ఉద్యోగాలు మిగిలిపోయాయి.
 
à°ˆ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది. ఇందుకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలి. అయితే.. à°ˆ పరీక్షల నిర్వహణకు పంచాయతీరాజ్‌ శాఖ సుముఖత వ్యక్తం చేయడం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. à°—à°¤ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ కూడా పరీక్ష ప్రశ్నావళిని సిద్ధం చేసేందుకు ముందుకు రావదం లేదని వెల్లడిస్తున్నాయి. దీంతో.. జిల్లాస్థాయిలోనే కలెక్టర్‌ చైర్మన్‌à°—à°¾ ఖాళీలు భర్తీ చేసే అవకాశాన్ని ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నామని పేర్కొంటున్నాయి.