1400 మంది వలంటీర్లుండగా 800 మందికి మాత్రమే జీతాలు

Published: Tuesday October 29, 2019

రెండు నెలల నుంచి వలంటీర్లుగా పనిచేస్తున్న తమకు గౌరవ వేతనం అందడం లేదని, తమకు జీతాలు ఇప్పించి ఆదుకోవాలని కోరుతూ à°•à°¡à°ª నగరంలోని కొందరు వలంటీర్లు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. కడపలో 1400 మంది వలంటీర్లుండగా 800 మందికి మాత్రమే గౌరవవేతనం వచ్చిందని కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు. డిగ్రీలు చదివి నిరుద్యోగులుగా ఉన్న తాము వలంటీరుగా ఎంపికయ్యామని, అయితే 2 నెలలకే తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు. తొలుత 35 ఏళ్ల వయసున్నవారిని కూడా వలంటీర్లుగా నియమించారని, జీవో 18 మేరకు ఇప్పుడా నిబంధనలు వర్తించవని అంటున్నారన్నారు. 2 నెలల పాటు ఇంటింటికీ తిరిగి రిపోర్టులు తయారు చేసి పంపిస్తే.. ఇప్పుడు వయసు మీరిందంటూ గౌరవ వేతనాలు రావని చెబుతున్నారని, ఇలాగైతే తమ బతుకులు రోడ్డున పడతాయని వాపోయారు.