నాణ్యతపై రాజీ పడొద్దని ఆదేశం

Published: Wednesday October 30, 2019
నిబంధనలను పాటించని కళాశాలలపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్య నాణ్యత విషయంలో ఏ ఒక్కరూ రాజీ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. విద్యారంగంలో సంస్కరణలపై ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తమ సిఫారసులను ముఖ్యమంత్రి జగన్‌కు మంగళవారం అందజేసింది. దీంతో ఆయా సిఫారసులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్‌, ఉన్నత విద్యలపై కమిటీ చైర్మన్‌ బాలకృష్ణన్‌ à°ˆ సందర్భంగా కూలంకషంగా వివరించారు. à°ˆ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..
 
వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1-8 తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెడుతున్నాం. దీనికి సంబంధించి పాఠ్యప్రణాళికను తయారు చేయాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలి. టీచర్లకు ఉత్తమ శిక్షణ ఇవ్వాలి. స్కూళ్లలో ప్రారంభించిన ‘నాడు-నేడు’ కార్యక్రమం కొనసాగాలి. ఇవన్నీ సక్రమంగా చేయగలిగితేనే మార్పులు వస్తాయి. 45 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. పిల్లల కోసం ఏర్పాటు చేసే ఫర్నిచర్‌ క్వాలిటీ విషయంలో రాజీపడొద్దు. పాఠ్యప్రణాళిక చాలా బలోపేతంగా ఉండాలి.
 
ప్రైవేటు స్కూల్స్‌ ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్‌ స్కూళ్లలో ఉన్న నాణ్యతా ప్రమాణాలను కూడా పరిశీలించాలి. నియోజకవర్గాన్ని à°’à°• యూనిట్‌à°—à°¾ తీసుకుని పరిశీలన చేయాలి. ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో నాణ్యతను పరిశీలించాలి. అగిక్రల్చర్‌ కాలేజీకి 100 ఎకరాలు ఉంటేనే అనుమతి ఇవ్వాలి. కానీ, రాష్ట్రంలోని ప్రైవేట్‌ అగ్రికల్చర్‌ కాలేజీల్లో à°ˆ భూమి ఉండటం లేదు. ఇబ్బడిముబ్బడిగా ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నారు. దీనిపై రెగ్యులేటరీ కమిషన్‌ నియంత్రణ ఉండాలి. ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు సరైన సదుపాయాలు, ప్రమాణాలు లేకుండా నడుస్తున్నాయి. ప్రమాణాలను ఉల్లంఘించిన వాటిని వెంటనే మూసేయాలి.
 
ప్రైవేట్‌ వర్సిటీల్లో నాణ్యతా ప్రమాణాలపై నియంత్రణ చేయలేనప్పుడు వాటిని ఎందుకు ప్రోత్సహించాలి? వర్సిటీల ప్రమాణాలను తనిఖీచేసే అవకాశం లేనప్పుడు ఎందుకు ప్రోత్సహించాలి? ప్రైవేట్‌ వర్సిటీల్లో క్వాలిటీ లేనప్పుడు వారిచ్చే సర్టిఫికెట్లకు ఏం విలువ ఉంటుంది? ప్రైవేట్‌ కాలేజీలను నడిపేవారి లక్ష్యాలు ఏమిటి? దీనిపై స్పష్టత ఉండాలి.
ప్రభుత్వ విద్యా సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేయాలి. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. వీటిపై కమిటీ దృష్టి పెట్టాలి. కమిటీ అంటే కేవలం సిఫారసులు చేయడమే కాదు, అమలులో కూడా భాగస్వామ్యం కావాలి. సంస్కరణలు అమలు చేస్తున్న విధానాలపై రెగ్యులేటరీ కమిషన్‌కు తెలియజేయాళని సీఎం దిశానిర్దేశం చేశారు.
విజయవాడలోని à°“ ప్రైవేట్‌ కాలేజీలో ఆకస్మిక తనిఖీల అంశాన్ని విద్యాశాఖ అధికారి ఒకరు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఫీజులను రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తూ, ప్రభుత్వానికి మాత్రం 2 వేలే వసూలు చేస్తున్నట్లుగా చూపిస్తున్నారని చెప్పారు.