బకాయిల కోసం పాత కాంట్రాక్టర్ల ఆందోళన

Published: Saturday November 02, 2019
పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన మేఘా కంపెనీ ప్రాజెక్టు మేనేజర్‌ మురళి చెప్పారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే ప్రాంతంలో 18à°µ బ్లాకు వద్ద మేఘా కంపెనీ ప్రతినిధులు, జల వనరులశాఖ అధికారులు భూమి పూజ చేసి, గోదావరికి హారతి ఇచ్చారు. à°ˆ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్‌ మురళి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో చరిత్ర కలిగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తమకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముందుగా స్పిల్‌వే పనులు ప్రారంభిస్తామని, ఎర్త్‌à°•à°‚ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులను గోదావరి వరద తీవ్రత తగ్గిన తర్వాత వేసవిలో ప్రారంభిస్తామని తెలిపారు. మేఘా కంపెనీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సతీశ్‌కుమార్‌, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఏసుబాబు కూడా మీడియాతో మాట్లాడారు.
 
తమ బకాయిల సమస్య పరిష్కారం కాకుండా పోలవరం ప్రాజెక్టు పనులు జరగనివ్వబోమని గతంలో ఇక్కడ పనిచేసిన లేబర్‌ కాంట్రాక్టర్లు, మాజీ ఉద్యోగులు, వాహనాల కాంట్రాక్టర్లు, మెస్‌ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు వచ్చిన మేఘా కంపెనీ ప్రతినిధులను, జలవనరుల శాఖ అధికారులను వారు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ట్రాన్స్‌ట్రాయ్‌, నవయుగ కంపెనీలు తమకు చెల్లించాల్సిన రూ.130 కోట్ల బకాయిలను ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభించాలని వాహనాలకు అడ్డుగా నిలబడి ఆందోళన చేశారు. మేఘా కంపెనీ వాహనాలకు గాలి తీసేశారు. ఎంతకీ ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు