ఊపిరి పీల్చుకున్న గురుకులాలు

Published: Sunday November 03, 2019
గురుకుల పాఠశాలల్లో వంట కష్టాలకు తెరపడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఏజన్సీకి వంట బాధ్యతలు అప్పగించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. క్షేత్ర స్థాయిలో ప్రతి గురుకుల పాఠశాలలో సొంతంగానే కాంట్రాక్టర్‌ కుదుర్చుకునేలా ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏజన్సీలను నియమించుకోనున్నారు. తద్వారా గురుకులాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వంట చేసుకునే కష్టాలు తొలగిపోనున్నాయి. గతంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఏజన్సీకి వంట చేసే కాంట్రాక్టర్‌ను కట్టబెట్టింది. తొలిరోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడచింది. ఎన్నికల సమయంలో ఏజన్సీకి బిల్లులు మంజూరు చేయలేదు. దాంతో క్షేత్రస్థాయిలో వంట చేసే సిబ్బందికి ఏజన్సీ వేతనాలు చెల్లించడం లేదు. ఫలితంగా సిబ్బంది పనులు మానివేశారు. దాంతో గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు వంట చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తర్వాత రోజుల్లో గురుకుల ప్రిన్సిపాల్స్‌ సొంతంగా మనుషులను సమకూర్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే అన్ని పాఠశాలలకు మనుషులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కొందరు ప్రిన్సిపాల్స్‌ సొంతంగా సొమ్ములు చెల్లించి వంట మనుషులను పెట్టుకునేవారు. ప్రభుత్వం బిల్లులు విడుదల చేస్తే తీసుకునేవారు. ఇటువంటి ఇబ్బందులన్నింటినీ గమనించిన అధికారులు పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించారు. à°† మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.
 
పాత పద్ధతిలో ప్రతి గురుకుల పాఠశాలలో సొంతంగా కాంట్రాక్ట్‌ కుదుర్చుకునే వెసులుబాటు ఉండేది. దానివల్ల వంట సిబ్బంది నియామకం సునాయాసమయ్యేది. ప్రభుత్వం సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఒకే ఏజన్సీని నియమించడం వల్ల పనిమనుషులను కుదుర్చుకోవడం కష్టతరమవుతోంది. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయడంలో జాప్యం చేస్తే వంట సిబ్బందికి కాంట్రాక్టర్‌ వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉండేదికాదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో సొమ్ములు చెల్లించాల్సి వచ్చేది. పలితంగా కాంట్రాక్టర్‌ చేతులెత్తేసే పరిస్తితి ఏర్పడింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ఒక్కో గురుకుల పాఠశాలకు వేర్వేరు కాంట్రాక్టర్‌లను నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల వంట సిబ్బందిని నచ్చచెప్పుకునే అవకాశం ఉంది. త్వరలోనే à°ˆ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. à°† మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది