3 నెలలు ఆగినవాళ్లు మరో 15 రోజులు ఆగలేరా?

Published: Saturday November 09, 2019
పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులు తక్షణం నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే వరకు ఎక్కడి పనులు అక్కడే నిలిపేయాలని చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు (పీహెచ్‌పీ) నిర్మాణం కోసం నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏపీ జెన్కో à°—à°¤ ఆగస్టు 14à°µ తేదీన రద్దు చేయగా.. అదే నెల 22à°µ తేదీన హైకోర్టు à°† ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయితే à°† ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ జెన్కో మరో పిటిషన్‌ దాఖలు చేయగా.. స్టే తొలగిస్తూ à°—à°¤ నెల 31à°µ తేదీన సింగిల్‌ జడ్జి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
 
దీనిని సవాల్‌ చేస్తూ నవయుగ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీలు చేసింది. à°ˆ మేరకు à°† సంస్థ డైరెక్టర్‌ వై.రమేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పి.విల్సన్‌ వాదనలు వినిపిస్తూ.. జలవిద్యుత్కేంద్రం నిర్మాణ ఒప్పందాన్ని జెన్కో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేసిందని, దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించగా సింగిల్‌ జడ్జి à°† ఉత్తర్వులను నిలుపుదల చేశారని.. అయితే జెన్కో స్టే వెకేట్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో మరో సింగిల్‌ జడ్జి à°† స్టేను ఎత్తివేయడంతో పాటు పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొన్నారని తెలిపారు. తమ పిటిషన్‌కు విచారణార్హత ఉందనే మొదటి సింగిల్‌ జడ్జి విచారణకు స్వీకరించారని చెప్పారు. కేసు కోర్టు విచారణలో ఉండగానే రాష్ట్రప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌లో వేరే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టిందని.. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని పేర్కొన్నారు.
 
పిటిషనర్‌ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులివ్వడంతో పాటు పోలవరం పనులపై స్టే విధించేందుకు సిద్ధమైంది. ఇందుకు అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా వేరే సంస్థకు అప్పగించామని, తద్వారా కోట్లాది రూపాయలు ఆదా అయ్యాయని.. పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇప్పుడు వాటిపై స్టే విధిస్తే కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. రిట్‌ అప్పీలును విచారణకు స్వీకరించినప్పుడు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించాల్సిందేనని పేర్కొంది. ఒకవైపు పనులు జరుగుతుంటే.. మరోవైపు ఎలా విచారణ చేపడతామని ప్రశ్నించింది. దీంతో తమ వాదనల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏజీ కోరారు. పిటిషనర్‌ బ్యాంకు పూచీకత్తు విషయమై దిగువ కోర్టులో మధ్యవర్తిత్వ(ఆర్బిట్రరీ) పిటిషన్‌ దాఖలు చేసి.. ఒప్పందం రద్దుపై మాత్రం హైకోర్టుకు వచ్చారని పేర్కొన్నారు. వివిధ కారణాలతో ఇప్పటికే జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులు మూడు నెలలపాటు నిలిచిపోయాయని, ఇప్పుడు స్టే విధిస్తే పనుల్లో మరింత జాప్యం జరుగుతుందని తెలిపారు.
 
అయితే బ్యాంకు పూచీకత్తు వ్యవహారం, కాంట్రాక్టు రద్దు వ్యవహారం వేర్వేరు అంశాలని ధర్మాసనం ఽస్పష్టం చేసింది. జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనుల కోసం మూడు నెలలు ఆగినవాళ్లు మరో 15 రోజులు ఆగలేరా అని ప్రశ్నించింది. పనుల్లో ఇప్పుడు ఏ స్థితి ఉందో తదుపరి విచారణ వరకు అదే స్థితి ఉండాలని స్పష్టం చేసింది. ఒకవేళ తమ మాటను ధిక్కరించి ముందుకెళ్తే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. à°ˆ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ వేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులుగా ఉన్న ఏపీ జెన్కో చైర్మన్‌, జెన్కో చీఫ్‌ ఇంజనీర్‌, పీఐపీహెచ్‌డబ్ల్యూ ధవళేశ్వరం సర్కిల్‌ ఎస్‌à°ˆ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, పోలవరం ప్రాజెక్టు అథారిటీలకు నోటీసులు ఇస్తూ 12à°µ తేదీకి వాయిదా వేసింది.