మీ అధ్యక్షుడి గుడ్డలూడదీసి రాజకీయాల నుంచి తప్పిస్తారా?

Published: Saturday November 09, 2019
‘అగ్రిగోల్డ్‌తో నాకు సంబంధం ఉందని మీరు చెప్పారు.సభాపతి స్ధానంలో ఉన్న మీరు ప్రతిపక్ష నేత పైనా... ఎమ్మెల్సీగా ఉన్న నాపైనా నిందారోపణలు చేయడం సముచితం కాదు. మీరు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటానంటే నాదొక సవాల్‌. అగ్రిగోల్డ్‌కు సంబంధించి ఏ ఒక్క అంశంలో అయినా నాకు సంబంధం ఉందని నిరూపిస్తే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొంటా. మీరు చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే మీరేం చేస్తారో కూడా చెప్పండి. ఇటువంటి బురద చల్లే ఆలోచనలన్నింటి వెనుకా మీ పార్టీ అధ్యక్షుడి ప్రోద్భలం, ప్రోత్సాహం ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మీ ఆరోపణలు అవాస్తమని తేలితే మీరన్నట్లే à°’à°• ప్రజా ప్రతినిధిగా మీ పార్టీ అధ్యక్షుడి గుడ్డలూడదీసి రాజకీయాల నుంచి తప్పించాలని సవాల్‌ విసురుతున్నాను.
 
à°ˆ సవాల్‌ మీరు స్వీకరిస్తారని ఆశిస్తున్నాను’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శుక్రవారం స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు బహిరంగ లేఖ రాశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన తమ్మినేని అత్యున్నతమైన శాసనసభాపతి స్థానం అలంకరించినప్పుడు విలువలతో సభను నడిపించి ట్రెండ్‌ సృష్టిస్తారని అనుకొన్నానని, కానీ à°† పదవిలో ఉండి అసభ్య పదజాలంతో మాట్లాడే ట్రెండ్‌ సృష్టిస్తారని అనుకోలేదని వ్యాఖ్యానించారు. ‘‘ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికై సీఎంగా, ప్రతిపక్ష నేతగా పనిచేసి దార్శనిక నేతగా గుర్తింపు పొందిన చంద్రబాబు గురించి గుడ్డలూడదీయిస్తా అని మీరు చేసిన వ్యాఖ్యలు స్పీకర్‌ స్థానాన్ని చిన్నబుచ్చేలా ఉన్నాయి.ఎన్నో మెట్లు దిగజారి దూషించి.. నేనొక ప్రజా ప్రతినిధిగా మాట్లాడుతున్నానంటూ మీరు సమర్థించుకోవడం హర్షణీయం కాదు. మీరు చేసిన వ్యాఖ్యలే సభలో సభ్యులు ఎవరైనా చేస్తే మీరెలా స్పందిస్తారు? వాటిని అన్‌ పార్లమెంటరీ పదాలని తొలగిస్తారా? లేక బయట ఎలా మాట్లాడినా ఫర్వాలేదు... సభలో హుందాగా మాట్లాడండి అని చెబుతారా?’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు.