ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా?

Published: Tuesday November 12, 2019

 à°‡à°¸à±à°• కొరతను పట్టించుకోని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను ఎగతాళి చేసేలా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఇదో ఆబోతు ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. కర్నూలుజిల్లా పత్తికొండలో సోమవారం ఆయ à°¨ పర్యటించారు. ఇసుక కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు నాగరాజు, సుంకన్న కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. వారి పిల్లల భవిష్యత్‌కు టీడీపీ à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని హామీఇచ్చారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ తెలంగాణ, మహారాష్ట్రల్లోనూ భారీ వరదలు వచ్చాయని, కానీ అక్కడ ఇసుక కొరత లేదని చెప్పారు. ఇక్కడ 5 నెలలుగా పనులు దొరక్క, అప్పులతో కడుపు నింపుకొంటున్న భవన నిర్మాణ కార్మికులు చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంట్లో పిల్లాడి సైకిల్‌ను అమ్ముకుని నిత్యావసరాలు కొనుక్కునే దుస్థితికి వారు చేరుకున్నారని వాపోయారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఇసుక తినేస్తున్నారంటూ తమపై ఆరోపణలు చేసిందని.. ఇప్పుడు పందికొక్కుల్లా పడి తింటున్నదెవరో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమరావతి సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఇసుక దందాల్లో వాటాల కోసం తన్నుకున్నారని, కృష్ణాజిల్లాలోనూ ఇలాంటి ఘటన జరిగిందని చెప్పారు. ఇసుక సమస్య పరిష్కారానికి టీడీపీ పోరాడుతుంటే డైటింగ్‌ కోసం దీక్షలు చేస్తున్నారని ఎగతాళి చేస్తున్నారని.. వెంటనే కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.