బుల్లిదూడ పుట్టుకతో అంతా సంచలనం

Published: Wednesday November 13, 2019
కాకినాడ:  à°¤à±‚ర్పు గోదావరి జిల్లా à°—ుమ్మలేరు రైతు ముత్యాల వీరభద్రరావుకు చెందిన ఆవుకు అతిచిన్న పుంగనూరు దూడ జన్మించింది. à°ˆ అరుదైన సంఘటన ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదైంది. దూడ ఎత్తు 15.6 అంగులాల పొడవు, 22 అంగులాల వెడల్పు, 7.4 కిలోల బరువు ఉంది. దీనిని రికార్డులలో నమోదు చేశారు. ఇది ఎంతో అరుదైన విషయంగా భావిస్తున్నారు. à°ˆ పుంగనూరు ఆవు దూడను భారత బుక్ ఆఫ్ రికార్డు, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదు చేస్తున్నట్లు భారత బుక్ ఆఫ్ రికార్డు చీఫ్ ఎడిటర్ అన్నపూర్ణ ప్రకటించారు. à°ˆ కార్యక్రమంలో ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డు జ్యూరీ సభ్యుడు మోహిత్ కృష్ణ పాల్గొన్నారు.
 
కార్తీక మాసంలో ఇలాంటి ఘటన జరగడంపట్ల సంచలనం రేగింది. ఇది ఏ విషయానికి సంకేతంగా భావించాలో తెలియక వారంతా మల్లగుల్లలు పడుతున్నారు. à°ˆ బుల్లి దూడను చూడ్డానికి గ్రామస్తులు తరలి వస్తున్నారు. నెట్ ప్రపంచంలో à°ˆ దూడ వైరల్‌à°—à°¾ మారింది. పుట్టీ పుట్టగానే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.