మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారు మీరూ చేసుకోండి..

Published: Wednesday November 13, 2019
‘నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్న కారణంగానే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా..? నా పెళ్లిళ్ల వల్లే విజయసాయిరెడ్డితో కలిసి జైల్లో కూర్చున్నారా’ అని సీఎం జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. పార్టీల పాలసీలు, విధివిధానాలపై తాను మా ట్లాడుతుంటే వ్యక్తిగత ఆరోపణలకు దిగడమేంటని నిలదీశారు. తనను కాపు నేతలతో తిట్టించడాన్ని తప్పుబట్టారు. తనపై జగన్‌, వైసీపీ నేతలు చేసిన వ్యక్తిగత ఆరోపణలకు ఆయన మంగళవారం విజయవాడలో ఘాటుగా బదులిచ్చారు. ‘మాట్లాడితే 3 పెళ్లిళ్లు అంటారు. మీరూ చేసుకోండి.. ఎవరు కాదన్నారు? మేం à°…à°¡à°¿à°—à°¿à°¨ దానికి పద్ధతి ప్రకారం సమాధానం చెప్పండి. ఇసుక, రివర్స్‌ టెండర్‌ దగ్గర నుంచి ఏ పనినీ పద్ధతి ప్రకారం చేయడం లేదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. పాము శివుడి మెడలో ఉన్నప్పుడే గౌరవిస్తాం. ఒక్కసారి జగన్‌ రెడ్డి పరిస్థితి అటూఇటైతే మీ పరిస్థితేంటో ఆలోచించుకోండి. ఎలా పడితే అలా మాట్లాడితే భరించడానికి మాది టీడీపీ కాదు. ప్రస్తుతం జగన్‌ రెడ్డి విధానం చూస్తుంటే, థౌజండ్‌ వాలాను ఆయన తనకు, తన 151 మంది ఎమ్మెల్యేలకు చుట్టి అంటించుకున్నట్లుగా ఉంది. మొత్తం కాలిపోతారు జాగ్రత్త’ అని హెచ్చరించారు.
 
జనసేన అంటే జగన్‌ రెడ్డికి భయమని.. లేదంటే తనపై à°…à°‚à°¤ ఘాటుగా స్పందించాల్సిన అవసరం లేదని పవన్‌ అన్నారు. ‘మేం బయటకు వస్తే లక్షన్నర మంది జనం రోడ్లపైకి వస్తారని నిరూపించాం. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కేవలం ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీకి ఇంత ఘాటుగా à°¸ మాధానం చెబుతున్నారు. à°ˆ వ్యాఖ్యలతో మీలో లోపాలున్నాయని అర్థమవుతోంది. నిన్నటి సందర్భమేంటి? మీరేం మాట్లాడారు? అబ్దుల్ కలాం ఆజాద్‌ జయంతి వేడుకల్లో మాట్లాడాల్సిన విషయమేంటి’ అని నిలదీశారు. ‘వేరే విధంగా లబ్ధిపొందాలనే ఉద్దేశంతో ఇసుకను ఆపేశారు. 50 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని కార్మిక సంఘాల వాళ్లు చెబుతున్నారు. కేవలం ఐదు కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో ఇచ్చింది. ఇసుక విధానం, తెలుగు భాష గురించి మేం పద్ధతిగా మాట్లాడాం. మేం వైసీపీ విధివిధానాలు, పాలసీలపై మాట్లాడితే.. వాళ్లు దానిపైనే విమర్శించాలి