తెలుగు భాషపైనే మాట్లాడా.. జగన్‌కు రఘు వివరణ

Published: Saturday November 23, 2019
‘నేను గీత దాటలేదు. పార్టీ వైఖరికి భిన్నంగా ఎక్కడా మాట్లాడలేదు’’ అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వివరణ ఇచ్చారు. ఇటీవల లోక్‌సభలో తెలుగు భాషపై రఘు చేసిన ప్రసంగంపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆయనకు ‘క్లాస్‌’ తీసుకోవాలంటూ వైవీ సుబ్బారెడ్డిని ఆదేశించారని వార్తలు వచ్చాయి. ఇక... రఘు సొంతంగా ప్రధాని మోదీని కలవడంపైనా జగన్‌ ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరిగింది. గురువారం పార్లమెంటులో రఘును ప్రధాని పలకరించడంతో విషయం మరింత ఆసక్తికరంగా మారింది. వీటన్నింటి నేపథ్యంలో... ఎంపీ రఘును సీఎం జగన్‌ అమరావతికి పిలిపింపినట్లు తెలిసింది. శుక్రవారం హుటాహుటిన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ‘అన్నా... రఘు à°°à°¾!’ అని జగన్‌ నవ్వుతూ పలుకరించారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వశిష్ఠ వారధి నిర్మాణం కోసం డీపీఆర్‌ తయారీ, టెండర్లు పిలవడం, శంకుస్థాపన తదితర అంశాలపై ముందుగా చర్చ జరిగింది. à°ˆ సమయంలో రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి à°Žà°‚à°Ÿà±€ కృష్ణబాబు, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి కూడా అక్కడ ఉన్నారు. అధికారులు వెళ్లిపోయాక.. లోక్‌సభలో తన ప్రసంగం గురించి రఘు వివరించినట్లు తెలిసింది.