రాజధానిని శ్శశానం అనడం సరికాదు

Published: Saturday November 30, 2019

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కుంది కానీ.. అదే నిరసన పేరుతో మాజీ సీఎం చంద్రబాబుపై రాళ్లు, చెప్పులు వేయడం సరికాదని బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఇలాంటి ఘటనలను ఎవరూ స్వాగతించరన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా అనంతపురం వచ్చిన ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబును సమర్థవంతమైన నాయకుడని 2014లో ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు సరైన రాజధాని నిర్మాణం చేపట్టలేకపోయారని, à°ˆ నేపథ్యంలోనే రాజధాని రైతుల్లో బాధ ఉందని, అయితే, à°† బాధను à°ˆ విధంగా వ్యక్తం చేయడం మంచిది కాదని అన్నారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చడం ఏ మేరకు సమంజసమో రాష్ట్ర మంత్రులు ఆలోచించుకోవాలన్నారు. జగన్‌ ప్రభుత్వం రాజధానిని ముందుకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. మార్పుకోసం ప్రజలు వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారని, అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు రావడం లేదన్నారు. రాష్ర్టానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. జాతీయ మీడియాలోనూ ఇదే అంశంపై కథనాలొస్తున్నాయని చెప్పారు.