ఒక్కటైన ఏడుకోట్ల మంది భారతీయులు

Published: Monday December 02, 2019
దేశంలోని అతిపెద్ద à°ˆ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు వ్యతిరేకంగా దేశంలోని ఏడు కోట్ల మంది చిరు వ్యాపారులు ఒక్కటయ్యారు. ధరల దోపిడీ, భారీ డిస్కౌంట్లు, భారతీయ చట్టాలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై స్థానిక వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తును, తమ వ్యాపారాలను ఇవి దారుణంగా దెబ్బతీస్తున్నాయని మండిపడుతున్నారు.
 
ఇవి రెండూ ఈస్టిండియా కంపెనీకి రెండో వెర్షన్ అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ ఆరోపించారు. ఢిల్లీలో ఇప్పటికే వీటికి వ్యతిరేకంగా చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. ‘గో బ్యాక్, గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. దాదాపు 700 మంది వ్యాపారులు ఢిల్లీలోని సర్దార్ బజార్ సెంట్రల్ ట్రాఫిక్ రోడ్డుపై ఆందోళనకు దిగి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే, à°—à°¤ బుధవారం దేశవ్యాప్తంగా అన్ని బజార్లలోనూ వ్యాపారులు ఆందోళన నిర్వహించారు.
 
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల ముఖ్య ఉద్దేశం వ్యాపారం చేయడం మాత్రమే కాదని, మార్కెట్‌పై గుత్తాధిపత్యంతోపాటు తమ నియంత్రణలోకి తెచ్చుకోవడమని ప్రవీణ్ ఖండేల్‌వాల్ ఆరోపించారు.
 
సీఏఐటీలో 70 మిలియన్ల మంది చిరు వ్యాపారులు ఉన్నారు. దేశంలోని దాదాపు 90 శాతం రిటైల్ వ్యాపారం వీరి నియంత్రణలోనే ఉంటుంది. అంతేకాదు, భారతదేశ దుకాణదారుల సంఘం à°’à°• బలమైన రాజకీయ శక్తిగా మారింది. ప్రధాని నరేంద్రమోదీ గద్దెనెక్కడంలో తమ హస్తం కూడా ఉందన్నది వీరి వాదన. ‘‘à°’à°• ప్రభుత్వానికి, ముఖ్యంగా చిరు వ్యాపారుల మద్దతు ఉన్న బీజేపీ ప్రభుత్వం వారి డిమాండ్లను పూర్తిగా విస్మరించడం రాజకీయంగా మంచిది కాదు’’ అని బెంగళూరులోని జైన్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రవేత్త సందీప్ శాస్త్రి అన్నారు. కనీసం కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చూడాలని ఆయన పేర్కొన్నారు.
 
విదేశీ à°ˆ-కామర్స్ సంస్థలపై గతేడాది దేశంలోని చిరు వ్యాపారులు కీలక విజయం సాధించారు. దీంతో సరుకులను విక్రయించడానికి à°ˆ ప్లాట్‌ఫాంలను ఎలా అనుమతించాలనే దానిపై ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. అయినప్పటికీ ఆఫర్లు, రాయితీతో దేశంలోని వినియోగదారులను తమవైపు ఆకర్షిస్తుండడంతో చిరు వ్యాపారులు వీటికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు.