సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్

Published: Monday December 02, 2019

సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతం మార్చుకున్న జగన్.. కులాన్ని ఎందుకు వదలటం లేదని ప్రశ్నించారు. మతం మార్చుకుంటే ఇంకా కులం ఉండకూడదని వ్యాఖ్యానించారు. జగన్ క్రిస్టియన్ అయితే ఏసులో ఉన్న సహనం, క్షమ గుణాలు ఆయనలో ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్‌కు ఓట్ల కోసం కులం, మతం, డబ్బు కావాలని దుయ్యబట్టారు. తాను ఓడిపోయాను కానీ పడిపోలేదని వ్యాఖ్యానించారు. వేల కోట్లు సంపాదించుకుని సిమెంట్ కంపెనీలు పెట్టుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు. వైసీపీది రంగుల రాజ్యం అని విమర్శించారు. ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే వేస్తున్నారని ప్రభుత్వ తీరుపై పవన్ ఫైర్ అయ్యారు.