వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తింపు

Published: Wednesday December 11, 2019
టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి.. తదనంతర పరిణామాల నేపథ్యంలో à°† పార్టీ నుంచి బహిష్కరణకు గురైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించడంపై టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. à°ˆ విషయమై స్పీకర్ తమ్మినేని సీతారాంను టీడీపీ ఎమ్మెల్యేలు కలిశారు. వంశీని ప్రత్యేక సభ్యుడిగా ఎలా గుర్తిస్తారని టీడీపీ సభ్యులు స్పీకర్‌ను ప్రశ్నించారు. వంశీ ప్రస్తుతానికి ఏ పార్టీలో లేరని, అందుకే ప్రత్యేకంగా గుర్తించానని స్పీకర్‌ స్పష్టం చేశారు.
 
విచక్షణాధికారంతో వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించినట్లు స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేలకు తెలిపారు. తనకున్న విచక్షణాధికారంతో వంశీకి మాట్లాడే అవకాశం ఇచ్చానని చెప్పారు. ప్రత్యేక సభ్యునిగా గుర్తించాలన్న వినతిని గౌరవిస్తున్నామని, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోండని వంశీకి స్పీకర్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. 181,182,183 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఏది కావాల్నో కోరుకోండని స్పీకర్ వంశీని అడిగారు. ఇప్పుడున్న సీటులోనే కూర్చుంటానని వంశీ అడగ్గా.. అలా కుదరదని, ఆ సీటు మరొకరికి కేటాయించామని స్పీకర్ చెప్పారు.