ప్రముఖ నటుడు గొల్లపూడి కన్నుమూత

Published: Thursday December 12, 2019
టాలీవుడ్ ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. à°—à°¤ కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు తీవ్ర సంతాపం తెలిపారు.
 
 
కాగా.. à°®à°¾à°°à±à°¤à±€à°°à°¾à°µà± కొన్నాళ్లు విశాఖలో మరికొంతకాలం చెన్నైలో గొల్లపూడి ఉంటున్నారు. నటనా, రచనా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. సాహితీ రంగంలోనూ ఆయన విశిష్ట కృషి చేశారు. రేడియో వ్యాఖ్యతగా కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన.. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. స్వాతిముత్యం లాంటి సినిమాలో వినూత్న విలనిజం చూపించారు. తనయుడు శ్రీనివాస్‌ పేరుతో కొత్త దర్శకులకు విశిష్ట ప్రోత్సాహాకాలు, అవార్డులను గొల్లపూడి అందించారు. నాటకాలు, నాటికలు, కథానికలు, సినిమా కథలు పత్రికా వ్యాసాల్లో గొల్లపూడి మారుతీరావు ముద్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. ‘కౌముది’ పేరుతో ఆయన వ్యాస సంకలనాలు వచ్చేవి. వర్తమాన రాజకీయాలు, క్రికెట్ లాంటి అంశాలపై చురుక్కుమనే చతురత గొల్లపూడి మారుతీరావు ప్రత్యేకత.