అసెంబ్లీ చీఫ్ మార్షల్‌కు వార్నింగ్

Published: Thursday December 12, 2019

అసెంబ్లీ చీఫ్ మార్షల్‌కు మండలి ఛైర్మన్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయొద్దంటూ హెచ్చరించారు. అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రివిలేజ్ పిటిషన్ దాఖలు చేస్తామని టీడీపీ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో సభ్యులతో పద్ధతిగా వ్యవహరించాలంటూ.. చీఫ్ మార్షల్‌కు మంత్రులు బుగ్గన, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స స్పష్టం చేశారు. గేట్ వద్ద చంద్రబాబు, టీడీపీ సభ్యుల పట్ల మార్షల్స్ వ్యవహరించిన తీరుపై.. వీడియో క్లిప్పింగులను మండలి ఛైర్మన్‌కు, మంత్రులకు టీడీపీ నేతలు చూపించారు.