నిందితుల మృతదేహాలపై ప్రత్యేక శ్రద్ధ

Published: Saturday December 14, 2019

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ మృతదేహాలను భద్రపరిచే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నిందితుల మృతదేహాలకు గాంధీ ఫోరెన్సిక్ నిపుణులు ఎంబామింగ్ చేశారు. ప్రత్యేక ఫ్రీజర్లలో నిందితుల మృతదేహాలను అధికారులు భద్రపరిచారు. ఇప్పటికే దిశ నిందితుల మృతదేహాలను సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలిచ్చేదాకా చెడిపోకుండా భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించింది. à°ˆ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్‌ వేసి, కింది కోర్టుల్లో ఉన్న వ్యాజ్యాల విచారణను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. మృతదేహాలపై సుప్రీంకోర్టునుంచి వివరణ తీసుకుని చెప్పాలని క్రితం విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఏజీని ఆదేశించింది. దీనిపై ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ శుక్రవారం కోర్టుకు వివరణ ఇచ్చారు. గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రతులను కోర్టు పరిశీలనకిచ్చారు. తదుపరి ఆదేశాలిచ్చేదాకా మృతదేహాలను భద్రపర్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోనే ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. వీటిని పరిశీలించిన హైకోర్టు సీజే ఆర్‌ఎస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని మృతదేహాలు చెడిపోకుండా భద్రపర్చాలని ధర్మాసనం ఆదేశించింది.