జాస్తి కృష్ణ కిశోర్‌పై క్రిమినల్‌ కేసు

Published: Tuesday December 17, 2019
‘‘అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ నిబంధనలు పాటించకుండా ఖర్చు పెట్టేశారు! ఈడీబీ ప్రకటనలను సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా కాకుండా నేరుగా ఇచ్చేశారు!!’’ ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌పై కేసు పెట్టడానికి సీఐడీ చూపిన కారణాలివి! ఆదివారం రాత్రి పొద్దుపోయాక సీఐడీ à°ˆ కేసు నమోదు చేసింది! à°ˆ కారణాలతో సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారిపై, అందులోనూ కేంద్రం నుంచి డిప్యుటేషన్‌ వచ్చిన అధికారిపై క్రిమినల్‌ కేసు పెట్టడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. భారీగా అవినీతికి పాల్పడటం, వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకోవడం, క్విడ్‌ప్రోకో లాంటి చర్యలకు పాల్పడితే... క్రిమినల్‌ కేసు పెట్టవచ్చు. కానీ... సీఐడీ చూపించింది కేవలం విధానపరమైన లోపాలే! ఇలాంటి ‘ప్రొసీజరల్‌’ లోపాలపై సంబంధిత అధికారి వివరణ అడుగుతారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించవచ్చు. తప్పు రుజువైతే... నిబంధనలకు మించి పెట్టిన ఖర్చును రికవరీ చేయవచ్చు. ఇప్పటిదాకా అమలులో ఉన్న పద్ధతి ఇదే.
 
కానీ జాస్తి కృష్ణ కిశోర్‌పై స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఫిర్యాదు చేయడం, రాత్రికి రాత్రి సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడంపై సరైనదేనా అని అధికారుల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి ఉదంతాలు గతంలో ఎప్పుడూ లేవని చెబుతున్నారు. అకౌంటింగ్‌-ఆడిటింగ్‌ నిబంధనలు పాటించలేదనేది కృష్ణ కిశోర్‌పై వచ్చిన తొలి ఆరోపణ. ఖర్చులకు బిల్లులు సమర్పించడం ఈడీబీ సీఈవో స్థాయి అధికారి బాధ్యత కాదు. అది కిందిస్థాయి అధికారులు చేస్తారు. బిల్లుల్లో తేడాలు వస్తే రికవరీ పెడతారు. అకౌంటింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుపెట్టారంటూ పలు అంశాలను ఏటా కాగ్‌ ఎత్తి చూపిస్తుంటుంది. వాటికి ప్రభుత్వాలు సమాధానం ఇస్తూ ఉంటాయి. à°ˆ ఖర్చులో క్విడ్‌ ప్రోకో, అవినీతివంటివి లేకుంటే వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రం ఎలాంటి విచారణ జరపకుండానే... జాస్తి కృష్ణ కిశోర్‌పై క్రిమినల్‌ కేసు పెట్టేశారు. ఈడీబీ ఇచ్చే ప్రకటనలను సమాచార ప్రసార శాఖ ద్వారా కాకుండా నేరుగా ఇవ్వడం ద్వారా జాస్తి కృష్ణ కిశోర్‌ జీవో నెంబరు 124ను ఉల్లంఘించారన్నది రెండో ఆరోపణ. à°ˆ జీవో ఎప్పటి నుంచో ఉంది. కొన్ని శాఖలు, విభాగాలు అవసరాన్ని బట్టి నేరుగా ప్రకటనలు ఇస్తున్నాయి. అంతెందుకు... కొత్త ప్రభుత్వం వచ్చాక జీవో 124పై à°’à°• రిమైండర్‌ ఇచ్చారు. ఇప్పటికీ కొన్ని శాఖలు సమాచార, ప్రసార శాఖ ద్వారా కాకుండా నేరుగా ప్రకటనలు ఇచ్చేస్తున్నాయి. అయినప్పటికీ... ఈడీబీ విషయంలో మాత్రమే ప్రత్యేకంగా కేసు పెట్టడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది.