శాసన మండలిలో లోకేష్ సవాల్

Published: Tuesday December 17, 2019
టీటీడీలో అన్యమత ప్రచారంపై ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. à°ˆ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అన్యమత ప్రచారంలో లోకేష్‌ హస్తం ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. సోషల్‌ మీడియా ద్వారా లోకేష్‌ అన్యమత ప్రచారం చేయిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని స్కెచ్‌ వేశారని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు.తిరుమల కొండపై శిలువ ఉందని నిరూపిస్తే రాజీమా చేస్తానని వెల్లంపల్లి సవాల్ విసిరారు. శిలువ లేకపోతే లోకేష్‌ రాజీనామా చేస్తారా..? అని వెల్లంపల్లి అసెంబ్లీ వేదికగా సవాల్ చేశారు.
à°ˆ సందర్భంగా మళ్లీ వెల్లంపల్లి కలుగజేసుకుని.. టీటీడీ కొండపై శిలువ సోషల్‌ మీడియా క్రియేటివిటీ అని స్పష్టం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని టీడీపీ కుట్ర పన్నిందని.. టీటీడీలో అన్యమత ప్రచారం జరిగిందనేది అవాస్తవమని తేల్చిచెప్పారు. తిరుమల వెంకటేశ్వరస్వామితో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఇప్పటికే నాశనం అయ్యారని.. ఆలయాల జోలికి వస్తే ఇంకా నాశనం అవుతారని టీడీపీని ఉద్దేశించి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.