మూడు రాజధానులు.. భేష్‌: చిరు

Published: Sunday December 22, 2019
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న యోచనను కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ నేత కొణిదెల చిరంజీవి స్వాగతించారు. అధికార, పాలనా వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రాజధానులను వ్యతిరేకించారు. అయితే అన్న అలా.. తమ్ముడు ఇలా స్టేట్మెంట్స్ ఇవ్వడంతో అభిమానులు భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
 
ఇదిలా ఉంటే.. జగన్‌కు చిరు జై కొట్టడంపై బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు స్పందించారు. ఆదివారం మధ్యాహ్నం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రమేష్ మీడియాతో మాట్లాడారు. ‘చిరంజీవి మూడు రాజధానులు మంచిది అన్నారు. ఆయనకు రాష్ట్రంలో ఓటు హక్కు కూడా లేదు. విశాఖలో లాభాపేక్ష కోసమే చిరంజీవి.. జగన్‌కు వంత పాడుతున్నారు’ à°…ని ఆయన ఆరోపించారు.
 
గింజలు చల్లి పావురాలు పట్టే చందంగా జగన్ పరిపాలన ఉంది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది బీజేపీ సిద్ధాంతం. జగన్ మూడు కళ్ళ సిద్ధాంతం కేవలం à°•à°‚à°Ÿà°¿ తుడుపు చర్య. సీమకు కావాల్సింది నికరజలాలు, ఉపాధినిచ్చే పరిశ్రమలు మాత్రమే. హై కోర్టు రాయలసీమకి రావాలనే బీజేపీ కోరుకుంది.. కానీ హైకోర్టును సైతం మూడు ముక్కలు చేసి పెడితే ఏం ఉపయోగం?. గొప్ప రాజధాని నిర్మాణం కావాలని జగన్ నాడు అసెంబ్లీలో చెప్పారు. నాలుగున్నర ఏళ్ల క్రితం ఉన్న గందరగోళ పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమయ్యాయి. ప్రాంతీయ పార్టీల వల్ల ప్రయోజనాలు ఏం లేవని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. జగన్‌కు చంద్రబాబుపై ఉన్న వైరం కారణంగా ప్రజలు బలైపోతున్నారు’ అని రమేష్ చెప్పుకొచ్చారు.
 
‘నివేదిక మూడు రోజుల్లో వస్తుందన్నప్పుడే సీఎం అసెంబ్లీలో ఎలా చెప్పారు..?. రావు గారి నివేదిక జగన్‌à°•à°¿ కట్ అండ్ పేస్ట్‌లా ఉంది. నిపుణుల నివేదికపై చర్చకు అఖిలపక్ష సమావేశం అవసరం లేదావిజయసాయి రెడ్డి భీమిలిలో రాజధాని ఉండే సర్వే నెంబర్లు కూడా చెప్పేస్తున్నారు. విశాఖలో వైసీపీ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడింది’ అని రమేశ్ ఆరోపించారు.