చంద్రబాబుపై కక్షతోనే రాజధాని మార్పు

Published: Sunday December 22, 2019

 à°®à°¾à°œà±€ సీఎం చంద్రబాబుపై కక్షతోనే రాజధానిని మారుస్తున్నట్టు కనిపిస్తోందని, ఇలాంటి నిర్ణయాలు అభివృద్ధికి ఎంతమాత్రమూ దోహదం చేయజాలవని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. శనివారం సీపీఐ 94à°µ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగిన బహిరంగ సభలో పార్టీ సీనియర్‌ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ మాట్లాడుతూ, కేవలం à°’à°• వ్యక్తిపై కక్షతో అమరావతిని మార్చడం సరైన నిర్ణయం కాదన్నారు. చంద్రబాబు అమరావతిలో 33 వేల ఎకరాలు తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరలేపితే, జగన్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి మరిన్ని వ్యాపారాలకు తెరదీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీల మధ్య మల్లయుద్ధం జరుగుతోందన్నారు. à°ˆ యుద్ధంలో ఉండమంటే తాను రిఫరీగా ఉంటానని వ్యంగస్త్రాలు సంఽధించారు. కాగా, అసెంబ్లీ ఒకచోట, సెక్రటేరియట్‌ ఇంకోచోట, హైకోర్టు మరోచోట అంటూ బుద్ధి, జ్ఞానం ఉన్న వాడు ఎవడూ ఇలాంటి ప్రకటన చేయడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సీఎం జగన్‌పై ధ్వజమొత్తారు. నియంతలు పాలించిన దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని సీఎం కూడా నియంత అనిపించుకున్నారని దుయ్యబట్టారు.