భారత పౌరసత్వం పొందేందుకు రాచబాట వేయాలా?

Published: Tuesday December 24, 2019
దేశం యావత్తు పౌరసత్వ సవరణ చట్టం గురించి చర్చిస్తోంది. దాన్ని అర్థం చేసుకోలేక, అపార్థం చేసుకున్న వారు ఆందోళన చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యతిరేకించే కొన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులు అగ్గికి ఆజ్యం పోస్తూ ఆందోళనలను ఎగదోస్తున్నారు. మరింత గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వాస్తవాలను అందరికీ అర్థమయ్యే రీతిలో విశదీకరించడం అవసరం.
 
పౌరసత్వ సవరణ చట్టం–-2019, పౌరుల జాతీయ రిజిస్టర్ (ఎన్ఆర్‌సి) రెండూ విభిన్న అంశాలు. కానీ, ఎలాంటి సంబంధం లేని à°ˆ రెండు అంశాలను కలగాపులగం చేస్తూన్న ప్రతిపక్షాలు దేశంలో భయోత్పాత వాతావరణం కల్పిస్తున్నాయి. ముస్లింలకు à°—à°² రక్షణలన్నింటినీ పూర్తిగా తొలగించి, వారిని దేశం వెలుపలి వారుగా ప్రకటించే లక్ష్యంతోనే మోదీ సర్కారు à°ˆ చట్టాలను తీసుకు వచ్చిందంటూ భయాందోళనలు రేపుతున్నాయి. భారత రాజకీయ చరిత్రలో ఇలా చెప్పడాన్ని మించిన అబద్ధం మరొకటి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. వాస్తవం అవగాహన అయితే à°ˆ సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అందుకే, à°† వివరాలను తెలుసుకుందాం.
 
తొలుత మనం పౌరసత్వ సవరణ బిల్లు గురించి చర్చిద్దాం. దేశవిభజన వరకు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు భారతదేశంలో అంతర్గత భాగాలు. ఆఫ్ఘనిస్థాన్‌ à°ˆ ఉపఖండంలో à°’à°• పెద్ద ప్రాంతం. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ ఏర్పాటు వెనుక ప్రధాన లక్ష్యం మతం. ఆయా దేశాల ఏర్పాటు సమయంలో భారీ సంఖ్యలో ముస్లింలు à°† దేశాలకు తరలిపోయారు. అక్కడ నుంచి హిందువులు భారత్‌కు వచ్చారు. అక్కడ నుంచి వచ్చిన à°ˆ శరణార్థులు భారతదేశంలో తిరిగి స్థిరపడ్డడారు. ‘ఒక్కటిగా ఉన్న భారత దేశం రెండుగా వేరుపడ్డాయి. విభజిత దేశం నుంచి భారత్‌కు వచ్చిన వారందరికీ పౌరసత్వం కల్పించడం మన బాధ్యత’ అని à°† సమయంలో మహాత్మాగాంధీ అన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్ పటేల్ కూడా అప్పట్లో అదే తరహా అభిప్రాయం వెల్లడించారు. దానితో లక్షలాది మంది శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించారు.
  
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ప్రస్తుతం పూర్తిగా స్వయం ప్రకటిత ఇస్లామిక్ దేశాలు. కాబట్టి, అక్కడ ముస్లింలను మతం పేరిట అవమానాల పాలు చేసే ఆస్కారమే లేదు. కానీ, భారత్‌ మతాధార దేశం కాదు, à°ˆ దేశంలో మతం కన్నా రాజ్యాంగమే పవిత్రమైనది. అందుకే, హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీ శరణార్థులందరికీ రక్షణ కల్పించే విధానాన్నే భారత్ అనుసరిస్తోంది.
 
2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం à°ˆ విధానాన్ని చట్టబద్ధం చేసేందుకు తొలిసారిగా చర్యలు తీసుకుంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులందరికీ పౌరసత్వం కల్పించనున్నట్టు ప్రకటించింది. నేడు à°ˆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు à°† రోజు వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ, ఇది వాస్తవం.