ఆర్‌ఐ కాళ్లపై పడి కన్నీరుమున్నీరు..

Published: Tuesday December 24, 2019
పట్టాదారు పాస్‌ పుస్తకం à°…à°¡à°¿à°—à°¿à°¨ à°“ మహిళా రైతుతో వీఆర్‌ఏ బేరం
ఆర్‌ఐ కాళ్లపై పడి కన్నీరుమున్నీరు.. ప్రకాశం జిల్లా ‘స్పందన’లో ఘటన
 
ఈమె మహిళా రైతు గురక వెంకటలక్ష్మమ్మ. తమ పొలానికి పట్టాదారు పాస్‌ పుస్తకం కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ, అధికారుల చుట్టూ కొన్నినెలలుగా తిరుగుతోంది. ‘పాస్‌ పుస్తకం రాదు. లక్ష ఇస్తాం. పొలం వదులుకోండి’ అని స్వయంగా వీఆర్‌ఏ బేరానికి దిగడంతో ఆమె దిమ్మెరపోయింది. న్యాయం చేయాల్సిన అధికారే ఇలా అంటే ఇక దిక్కెవరు? దీంతో సోమవారం ప్రకాశం జిల్లా రాచర్ల మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కాళ్లపై పడిపోయింది. తన గోడంతా వెళ్లబోసుకోంది. ఆమె కథనం ప్రకారం,
 
రాచర్ల మండలం సోమిదేవిపల్లికి చెందిన గురక కోటమ్మకు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరైన లక్ష్మీరెడ్డి తన తల్లి పేరు మీద ఉన్న 2.75 ఎకరాల పొలంలో తన సగం వాటా రిజిష్టర్‌ చేయించుకున్నాడు. తన వాటాగా వచ్చిన పొలానికి పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేయాలంటూ నాలుగు నెలల క్రితం మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. లక్ష్మీరెడ్డి పొలం పనుల్లో ఉండటంతో, ఆయన తరఫున వెంకటలక్ష్మమ్మ అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా పని కావడం లేదు. ఎందుకనేది స్పందన కార్యక్రమానికి వచ్చిన ఆర్‌ఐకి కన్నీళ్లపర్యంతమవుతూ ఆమె చెప్పుకొంది. ‘రూ.లక్ష తీసుకుని పొలం వదులుకోవాలని వీఆర్‌ఏ ఒత్తిడి తెస్తున్నారు. à°† పొలమే మాకు ఆధారం. న్యాయం చేయండి’’ అంటూ ప్రాధేయపడింది.