చిరు.. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి!

Published: Tuesday December 24, 2019
నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన సంచలన ప్రకటనను కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి స్వాగతించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యతిరేకించడం.. చిరు స్వాగతించడం గమనార్హం.  à°ˆ విషయమై రాజధాని రైతులు మాట్లాడుతూ చిరంజీవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరులో ధర్నాకు దిగిన రాజధాని రైతులను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పలకరించింది.
 
పవన్ కల్యాణ్ మాకు సపోర్ట్ చేయడం సంతోషంగా ఉంది. కానీ చిరంజీవి ఇలా స్వాగతిస్తున్నట్లు ప్రకటించడం పద్ధతి కాదు. చిరు ఏ రోజూ ప్రజా సమస్యల మీద మాట్లాడింది లేదు.. పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మూడు రాజధానులను ఎలా సమర్థిస్తారు..? ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. మీ సినిమాలు చూడటానికి.. ఆడించుకోవటానికి జగన్‌గారిని కలిశారు కానీ.. ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. అసలు మీరు ఆంధ్రాలో ఉంటున్నారో..? వైజాగ్‌లో ఉంటున్నారో..? హైదరాబాద్‌లో ఉంటున్నారో..? జనాలకు తెలియని పరిస్థితి à°…ని రాజధానికి చెందిన à°“ రైతు వ్యాఖ్యానించాడు.
 
చిరుకు వైజాగ్‌లో చాలా ఆస్తులున్నాయి. అందుకే మూడు రాజధానులు నాకు ఇష్టమని అన్నారు. చిరంజీవి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో చిరు సినిమాలు రిలీజ్ చేయనివ్వం. రైతుల గురించి మీకు తెలుసు కాబట్టి.. రైతులు పెట్టే అన్నమే మీరు తింటున్నారు కాబట్టి మాకు మద్దతివ్వండి à°…ని రాజధానికి చెందిన మరో రైతు మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. కాగా.. ఈయన సినీ ఇండస్ట్రీలోనూ పనిచేస్తున్నాడు. ఇలా నలుగురైదుగురు రైతులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. చిరుపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.