తాగి తందానాలాడారు...కాలేజీ నుంచి తొలగింపు

Published: Monday December 30, 2019
రాష్ట్రంలోని నాగపట్టణంలో సంచలనం రేపింది.మైలదుత్తురాయ్ పట్టణంలోని ధర్మాపురం అధీనం ఆర్ట్స్ కళాశాలలో నలుగురు యువతులు డిగ్రీ చదువుతున్నారు. à°“ యువతి బీఏ ఇంగ్లీషు లిటరేచర్‌లో రెండో సంవత్సరం, మరో ముగ్గురు అమ్మాయిలు బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నారు. నలుగురు అమ్మాయిల్లో à°’à°•à°°à°¿ జన్మదినం ఉండటంతో కళాశాలకు పది కిలోమీటర్ల దూరంలోని సీతార్ కదు గ్రామంలోని ఒకమ్మాయి ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. à°ˆ మందు పార్టీలో ముగ్గురు అమ్మాయిలు కళాశాల యూనిఫాం ధరించి మగ స్నేహితులతో కలిసి మద్యం తాగారు. కళాశాల అమ్మాయిలు మద్యం తాగుతుండగా దాన్ని à°“ స్నేహితుడు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తల్లిదండ్రులకు తెలియకుండా నలుగురు కళాశాల విద్యార్థినులు రహస్యంగా ఇంట్లోనే కళాశాల యూనిఫాం ధరించి మద్యం తాగారు. à°ˆ వీడియో కాస్తా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ స్వామినాథన్ దృష్టికి వచ్చింది.
 
అంతే తమ కళాశాల విద్యార్థినులు మద్యం తాగడం కళాశాల నిబంధనలకు విరుద్ధమని, మందు పార్టీ ఇంట్లో చేసుకున్నా వారు కళాశాల యూనిఫాం ధరించి ఉన్నందున, దీనివల్ల కళాశాల ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని ప్రిన్సిపాల్ స్వామినాథన్ చెప్పారు. కళాశాల అమ్మాయిలు మద్యం తాగిన ఘటనను తీవ్రంగా పరిగణించిన కళాశాల యాజమాన్యం సదరు నలుగురిని తమ కళాశాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. తమ కళాశాల ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు మద్యం తాగిన నలుగురు అమ్మాయిలను కళాశాల నుంచి తొలగించామని భారతీదాసన్ యూనివర్శిటీ రిజిష్ట్రార్ గోపినాథ్ చెప్పారు.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశించారని వర్శిటీ రిజిష్ట్రార్ వివరించారు.